ప్రపంచ బ్యాంకు అధ్యక్షుడిగా భారత సంతతికి చెందిన అజయ్ బంగా, ఏకగ్రీవంగా ఎన్నిక

Indian-Origin Ajay Banga Set To Become World Bank President Unopposed as Nominations Closed,Indian-Origin Ajay Banga,Ajay Banga Set To Become World Bank President,Ajay Banga Set Unopposed as Nominations Closed,World Bank President Unopposed,Mango News,Mango News Telugu,US Nominee Ajay Banga Set To Become President,No challengers to Ajay Banga,India-born American Ajay Banga,Ajay Banga Set To Become First Indian-Origin President,Indian-Origin Ajay Banga Latest News,Indian-Origin Ajay Banga Latest Updates,Ajay Banga Live News and Updates,World Bank President Latest News

ప్రపంచ బ్యాంకు అధ్యక్షుడిగా భారత సంతతికి చెందిన అజయ్ బంగా ఏకగ్రీవంగా ఎన్నికయ్యారు. బుధవారం నామినేషన్లు ముగిసిన నేపథ్యంలో ఏ దేశమూ ప్రత్యామ్నాయ అభ్యర్థిని బహిరంగంగా ప్రతిపాదించకపోవడంతో ఆయన ఎన్నిక లాంఛనమే కానుంది. దీనిపై ప్రపంచ బ్యాంకు అధికారికంగా ప్రకటన చేయనుంది. ఇక ఫిబ్రవరి చివరలో ప్రపంచ బ్యాంకు అధ్యక్ష పదవికి నామినేషన్ ప్రక్రియ ప్రారంభమవగా.. నామినేషన్లు ముగిసిన తర్వాత బరిలో నిలిచిన పోటీదారులకు అధికారిక ఇంటర్వ్యూలను నిర్వహిస్తామని బోర్డు ఇప్పటికే ప్రకటించింది. అయితే బరిలో అజయ్ బంగా తప్ప మిగిలిన అభ్యర్థులెవరూ లేకపోవడంతో, ఆయన ఎన్నిక ఏకగ్రీవం అయిన నేపథ్యంలో త్వరలోనే అధికారికంగా బాధ్యతలు చేపట్టనున్నారని బ్యాంకు వర్గాలు పేర్కొన్నాయి.

కాగా ప్రస్తుత అధ్యక్షుడు డేవిడ్ మాల్పాస్ పదవీకాలం ఇంకా దాదాపు ఒక సంవత్సరం ఉండగా.. ముందుగానే పదవీ విరమణ చేయబోతున్నట్లు ప్రకటించడంతో ప్రపంచ బ్యాంకు తదుపరి చీఫ్ కోసం ఎన్నిక అనివార్యమైంది. మాల్పాస్ 2019లో అప్పటి అమెరికా డొనాల్డ్ ట్రంప్ చేత ఈ పదవికి నామినేట్ చేయబడ్డారు. వాస్తవానికి ఆయన పదవీకాలం 2024 చివరిలో ముగియాల్సి ఉండగా, దాదాపు ఏడాదిన్నర ముందే బాధ్యతల నుంచి తప్పుకుంటున్నారు. ఈ నేపథ్యంలో ప్రపంచ బ్యాంక్‌కు నాయకత్వం వహించేందుకు అజయ్ బంగా సిద్ధమయ్యారు. అయితే మాజీ మాస్టర్ కార్డ్ ఇంక్ చీఫ్ ఎగ్జిక్యూటివ్‌ అజయ్ బంగాను గత నెలలో అమెరికా అధ్యక్షుడు జో బైడెన్ ప్రతిపాదించడం తెలిసిందే. కాగా ప్రపంచ ఆర్థిక వ్యవస్థ మందగమనం దిశగా వెళ్తుండటం, అభివృద్ధి చెందిన దేశాలు సైతం కఠిన సవాళ్లు ఎదుర్కొంటున్న వేళ అజయ్ బంగా ఈ కీలక బాధ్యతలు చేపట్టనుండటం గమనార్హం.

ఇక 63 ఏళ్ల అజయ్ బంగా ఇటీవలి వరకూ ప్రముఖ ఈక్విటీ సంస్థ జనరల్ అట్లాంటిక్‌లో వైస్ ఛైర్మన్‌గా పనిచేశారు. అంతకుముందు ఆయన మాస్టర్ కార్డ్‌ సంస్థలో చీఫ్ ఎగ్జిక్యూటివ్‌గా పనిచేశారు. అజయ్ బంగా 1959 నవంబర్ 10న మహారాష్ట్రలోని పుణెలో జన్మించారు. ఆయన తండ్రి హర్భజన్ సింగ్ బంగా ఇండియన్ ఆర్మీలో లెఫ్టినెంట్ జనరల్ గా పనిచేశారు. దీంతో తండ్రి వృత్తి రీత్యా అనేక రాష్ట్రాల్లో అజయ్ బంగా విద్యాభ్యాసం కొనసాగింది. ఈ క్రమంలో ఆయన తన పాఠశాల విద్యను హైదరాబాద్ పబ్లిక్ స్కూల్‌లో పూర్తి చేశారు. ఆ తర్వాత ఢిల్లీ యూనివర్సిటీలో గ్రాడ్యుయేషన్ పూర్తి చేశారు. అనంతరం పలు ప్రముఖ సంస్థల్లో పనిచేసి అనుభవం గడించారు. ఈ క్రమంలో ఇంటర్నేషనల్ ఛాంబర్ ఆఫ్ కామర్స్‌కు గౌరవ అధ్యక్షుడిగా కూడా బంగా పనిచేశారు. 2016లో భారత ప్రభుత్వం పద్మశ్రీ అవార్డుతో అజయ్ బంగాను గౌరవించింది.

మ్యాంగో న్యూస్ లింక్స్:

టెలీగ్రామ్ : https://t.me/mangonewsofficial

గూగుల్ ప్లే స్టోర్ : https://bit.ly/2R4cbgN

ఆపిల్/ఐఓఎస్ స్టోర్ : https://apple.co/2xE

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

2 × 5 =