ఆరోగ్య మహిళకు విశేష ఆదరణ, మూడు మంగళవారాల్లో 19 వేల మందికిపైగా స్క్రీనింగ్‌

Minister Harish Rao Appeals Women to Utilize Arogya Mahila Program 19 Thousand Women Screened in 3 Tuesdays,Minister Harish Rao Appeals Women to Utilize Arogya Mahila Program,Arogya Mahila Program 19 Thousand Women Screened,19 Thousand Women Screened in 3 Tuesdays,Mango News,Mango News Telugu,Arogya Mahila Program 19 Thousand Women News,3 Tuesdays Arogya Mahila Program Latest News,3 Tuesdays Arogya Mahila Program Latest Updates,3 Tuesdays Arogya Mahila Program Live News,Telangana Latest News And Updates,Minister Harish Rao Latest News

రాష్ట్రంలోని మహిళలంతా సంపూర్ణ ఆరోగ్యంగా ఉండాలనే సీఎం కేసీఆర్‌ ఆలోచన మేరకు అమలు చేస్తున్న ‘ఆరోగ్య మహిళ’ కార్యక్రమానికి విశేష స్పందన లభిస్తోంది. ప్రతి మంగళవారం మహిళలకు మాత్రమే వైద్య పరీక్షలు జరిపేందుకు రాష్ట్ర వ్యాప్తంగా 100 ‘ఉమెన్‌ స్పెషల్‌ క్లినిక్స్‌’ను రాష్ట్ర ప్రభుత్వం ఏర్పాటు చేసిన సంగతి తెలిసిందే. మూడు మంగళవారాల్లో మొత్తం 19వేల మందికిపైగా మహిళలకు వైద్య పరీక్షలు జరిగాయి. ‘మహిళ ఆరోగ్యం-ఇంటి సౌభాగ్యం’ అనే లక్ష్యంతో ఈ వైద్య కేంద్రాల్లో మహిళలు ఎదుర్కొంటున్న 8 ప్రధాన ఆరోగ్య సమస్యలకు సంబంధించి పరీక్షలు చేసి, చికిత్స అందించడం జరుగుతున్నది. మహిళలు తీరిక లేకనో, భయం కారణంగానో, సరైన అవగాహన లేకనో, సొంతంగా ఆసుపత్రికి వెళ్లలేకనో, ఇతర కారణాలతోనో తమ అనారోగ్య సమస్యలను బయటపెట్టుకోరు. దీంతో వారి ఆరోగ్య సమస్యలు ముదిరి, పెద్ద వ్యాధులకు దారి తీస్తున్నాయి. ఇలాంటివారికి ‘ఆరోగ్య మహిళ’ కార్యక్రమం కొండంత భరోసా ఇస్తోంది.

క్రమంగా పెరుగుతున్న ఆదరణ:

ఆరోగ్య మహిళ కార్యక్రమాన్ని అంతర్జాతీయ మహిళా దినోత్సవం సందర్భంగా ఈ నెల 8వ తేదీన తెలంగాణ రాష్ట్ర ఆర్థిక, వైద్యారోగ్య శాఖ మంత్రి తన్నీరు హరీశ్‌ రావు కరీంనగర్‌లో ప్రారంభించిన సంగతి తెలిసిందే. ఆ తర్వాత 14వ తేదీ నుంచి ఆరోగ్య పరీక్షలు ప్రారంభం అయ్యాయి. మొదటి వారం 4,793 మంది మహిళలు తరలివచ్చి వైద్య పరీక్షలు చేయించుకున్నారు. ఈ నెల 21వ తేదీన 6,328 మంది వచ్చారు. ఓపీ 32% పెరిగింది. 28వ తేదీన మరింత పెరిగి 7,965 మందికి స్క్రీనింగ్‌ నిర్వహించారు. అంతకుముందు వారంతో పోల్చితే 26% మంది అధికంగా వచ్చారు. మూడు మంగళవారాల్లో కలిపి 10 వేలకుపైగా నమూనాలను సేకరించి పరీక్షల కోసం ల్యాబ్‌కు పంపించారు. మొదటివారం 2,723 నమూనాలను సేకరించగా, రెండో వారం 2,792 నమూనాలను, మూడోవారం 4,727 నమూనాలను సేకరించి తెలంగాణ డయాగ్నోస్టిక్స్‌కు పంపించారు. ఈ ఫలితాలు 24 గంటల్లోనే వారికి అందుతున్నాయి. ఈ మేరకు రాష్ట్ర ఆరోగ్యశాఖ ఒక ప్రకటన విడుదల చేసింది.

మహిళలు సద్వినియోగం చేసుకోవాలి – వైద్యారోగ్య శాఖ మంత్రి హరీశ్‌ రావు

మహిళల సంపూర్ణ ఆరోగ్యం కోసం సీఎం కేసీఆర్‌ ఆలోచన మేరకు అమలు చేస్తున్న ‘ఆరోగ్య మహిళ’ను ప్రతి ఒక్కరూ సద్వినియోగం చేసుకోవాలి. ఉమెన్‌ స్పెషల్‌ క్లినిక్స్‌ కు ఆదరణ పెరుగుతున్నది. మహిళల సమ్రగ ఆరోగ్య పరిరక్షణ కోసం, మహిళలు ప్రధానంగా ఎదుర్కొంటున్న 8 రకాల ఆరోగ్య సమస్యలను గుర్తించి వైద్యం అందిస్తున్నాం. ఈ సేవలను మహిలంతా సద్వినియోగం చేసుకోవాలి. అక్రిడిటేటెడ్ మహిళా జర్నలిస్టులకు కూడా ప్రత్యేక వైద్య శిబిరాన్ని హైదరాబాద్ లోని మాసబ్ ట్యాంక్ లో గల సమాచార, పౌర సంబంధాల శాఖ కార్యాలయం వద్ద ఏర్పాటు చేశాం. ఈ సేవలు వినియోగించుకోవాలని కోరుతున్నానని పేర్కొన్నారు.

మార్చి 28న స్క్రీనింగ్‌ వివరాలు:

  • ఓపీ: 7965
  • టెస్టులు: 4727
  • రొమ్ము క్యాన్సర్‌ స్క్రీనింగ్‌: 5425
  • గర్భాశయ ముఖద్వార క్యాన్సర్‌: 1463
  • నోటి క్యాన్సర్‌: 5423
  • మూత్ర కోశ ఇన్ఫెక్షన్లు: 654
  • సూక్ష్మ పోషక లోపాలు: 1735
  • థైరాయిడ్‌ ప్రొఫైల్స్‌: 1682
  • విటమిన్‌ డీ పరీక్షలు: 1128
  • సీబీపీ: 2982
  • పై ఆసుపత్రికి రెఫర్‌: 603.

 

మ్యాంగో న్యూస్ లింక్స్: 

టెలీగ్రామ్ : https://t.me/mangonewsofficial

గూగుల్ ప్లే స్టోర్ : https://bit.ly/2R4cbgN

ఆపిల్/ఐఓఎస్ స్టోర్ : https://apple.co/2xE

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

fifteen − 5 =