ప్రపంచ చెస్ ఛాంపియన్‌ కార్ల్‌సన్‌పై మరోసారి అద్భుత విజయం సాధించిన ఇండియన్ టీనేజర్ ప్రజ్ఞానంద

Indian Young Grandmaster Praggnanandhaa Stuns Five-Time World Champion Carlsen in FTX Crypto Cup, Grandmaster Praggnanandhaa Stuns Five-Time World Champion Carlsen in FTX Crypto Cup, Praggnanandhaa stuns five-time World Champion Carlsen, Indian Young Grandmaster Praggnanandhaa, Five-Time World Champion Carlsen, Indian Young Grandmaster, FTX Crypto Cup, Praggnanandhaa, Magnus Carlsen, FTX Crypto Cup News, FTX Crypto Cup Latest News And Updates, FTX Crypto Cup Live Updates, Mango News, Mango News Telugu

భారత యువ గ్రాండ్‌ మాస్టర్‌ ప్రజ్ఞానంద మరోసారి ప్రపంచ చెస్ ఛాంపియన్‌ మాగ్నస్‌ కార్ల్‌సన్‌కు షాక్ ఇచ్చాడు. ఎఫ్‌టీఎక్స్‌ క్రిప్టో కప్‌ అంతర్జాతీయ ర్యాపిడ్‌ చెస్‌ టోర్నీలో భాగంగా సోమవారం జరిగిన చివరిదైన ఏడో రౌండ్‌లో కార్ల్‌సన్‌ను మరోసారి ఓడించి బ్లిట్జ్‌ టై బ్రేకర్‌లో ఘన విజయం సాధించాడు. తద్వారా ప్రజ్ఞానంద ఎఫ్‌టీఎక్స్‌ క్రిప్టో కప్‌ టోర్నీలో రన్నరప్‌గా నిలిచాడు. కాగా ఓవరాల్‌గా టాప్‌ స్కోరు సాధించిన నార్వేకు చెందిన కార్ల్‌సన్‌ టోర్నీ విజేతగా నిలిచాడు. ఇక గడచిన ఆరు నెలల వ్యవధిలో ప్రజ్ఞానంద.. కార్ల్‌సన్‌ను ఓడించడం ఇది మూడో సారి కావడం విశేషం.

వీరిద్దరి మధ్యా మొత్తం ఆరు గేమ్‌లు జరుగగా ప్రజ్ఞానంద వ‌రుస‌గా మూడు గేమ్‌లను గెలిచాడు. తొలి రెండు గేమ్‌లు డ్రా అవగా, మూడవ దానిలో కార్ల్‌సన్‌ పైచేయి సాధించాడు. అయితే ఆ తర్వాత అనూహ్యంగా పుంజుకున్న ప్రజ్ఞానంద నాలుగ‌వ గేమ్‌ను గెలిచి మ్యాచ్‌ను టై బ్రేక్‌లోకి తెచ్చాడు. కీలకమైన టై బ్రేక్‌లో రెండు గేమ్‌లు గెలిచి కార్ల్‌స‌న్‌కు షాకిచ్చాడు. కార్ల్‌స‌న్‌కు 16 మ్యాచ్ పాయింట్లు ద‌క్క‌గా, ప్ర‌జ్ఞానందకు 15 పాయింట్లు వ‌చ్చాయి. ఇక మూడ‌వ స్థానంలో ఇరానియన్-ఫ్రెంచ్ చెస్ గ్రాండ్ మాస్టర్ అలిరిజా ఫిరౌజా నిలిచాడు.

మ్యాంగో న్యూస్ లింక్స్:

టెలీగ్రామ్ : https://t.me/mangonewsofficial

గూగుల్ ప్లే స్టోర్ : https://bit.ly/2R4cbgN

ఆపిల్/ఐఓఎస్ స్టోర్ : https://apple.co/2xEY

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here