యూపీఐ లావాదేవీలపై చార్జీలు విధించే అంశం పరిశీలనలో లేదు: కేంద్ర ఆర్ధిక శాఖ

Ministry of Finance Clarifies that There is no Consideration in Govt to Levy any Charges for UPI Services, Union Finance Ministry Confirms Not Considering To Levy Charges On UPI Transactions, There is no consideration in Govt to levy any charges for UPI services, Union Finance Ministry, No Charges UPI Transactions, UPI Transactions, Unified Payments Interface, Central Government is not considering levying charges on digital payment modes, digital payment modes, rumors of charges on UPI transactions, National Payments Corporation of India, UPI Transactions Charges News, UPI Transactions Charges Latest News And Updates, UPI Transactions Charges Live Updates, Mango News, Mango News Telugu,

యూనిఫైడ్ పేమెంట్స్ ఇంటర్‌ఫేస్ (యూపీఐ) లావాదేవీలపై త్వరలో చార్జీలు విధించబోతున్నారంటూ గత కొన్ని రోజులుగా వార్తలు వస్తున్న విషయం తెలిసిందే. ఈ నేపథ్యంలో ఈ అంశంపై కేంద్ర ఆర్థిక శాఖ ఆదివారం నాడు కీలక ప్రకటన చేసింది. “యూపీఐ అనేది ప్రజలకు అపారమైన సౌలభ్యం మరియు ఆర్థిక వ్యవస్థకు ఉత్పాదకత లాభాలతో కూడిన డిజిటల్ పబ్లిక్ వ్యవస్థ. యూపీఐ సేవలకు ఏదైనా ఛార్జీలు విధించేందుకు ప్రభుత్వం వద్ద ఎలాంటి పరిశీలన లేదు. కాస్ట్ రికవరీ కోసం సర్వీస్ ప్రొవైడర్ల ఆందోళనలను ఇతర మార్గాల ద్వారా తీర్చాలి” అని కేంద్ర ఆర్ధిక శాఖ పేర్కొంది.

అలాగే డిజిటల్ పేమెంట్స్ ఎకో సిస్టమ్ కోసం ప్రభుత్వం గత సంవత్సరం ఆర్థిక సహాయాన్ని అందించినట్టు చెప్పారు. అలాగే ఆర్థిక, వినియోగదారు-స్నేహపూర్వకంగా ఉండే డిజిటల్ పేమెంట్స్ ను మరింతగా స్వీకరించడాన్ని ప్రోత్సహించడానికి మరియు పేమెంట్స్ ప్లాట్‌ఫారమ్‌ల ప్రొమోషన్ కోసం ఈ సంవత్సరం కూడా అదే విధంగా సహాయం ప్రకటించబడిందని కేంద్ర ఆర్ధిక శాఖ స్పష్టం చేసింది. దేశంలో యూపీఐ లావాదేవీలపైనా కూడా ఛార్జీలను వసూలు చేసే అంశం రిజర్వ్‌ బ్యాంక్‌ పరిశీలనలో ఉన్న నేపథ్యంలో చార్జీలు విధించే ఆలోచన లేదని పేర్కొంటూ కేంద్ర ఆర్థిక శాఖ ప్రకటన చేసింది.

మ్యాంగో న్యూస్ లింక్స్:

టెలీగ్రామ్ : https://t.me/mangonewsofficial

గూగుల్ ప్లే స్టోర్ : https://bit.ly/2R4cbgN

ఆపిల్/ఐఓఎస్ స్టోర్ : https://apple.co/2xEY

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

16 + 13 =