రతన్‌ టాటాకు మరో అవార్డ్.. నెట్టింట్లో ప్రశంసల వెల్లువ

Industrialist Ratan Tata To Get States First Udyog Ratna Award From Maharashtra Govt,Industrialist Ratan Tata,Ratan Tata To Get States First Udyog Ratna,First Udyog Ratna Award From Maharashtra Govt,Mango News,Mango News Telugu,Ratan Tata,Another award for Ratan Tata, Udyoga Ratna Award, For Young Entrepreneur, Women Entrepreneur, Marathi Entrepreneurs,Udyog Ratna Award Latest News,Udyog Ratna Award Latest Updates,Industrialist Ratan Tata News Today,Industrialist Ratan Tata Latest Updates,Industrialist Ratan Tata Live News

టాటా గ్రూప్ గౌరవ చైర్మన్ రతన్ టాటాకు మరో మహా గౌరవం దక్కింది. మహారాష్ట్ర సర్కార్ కొత్తగా ప్రవేశపెట్టిన ఉద్యోగ రత్న అవార్డును ఈ లెజెండ్ దక్కించు కున్నారు. తమ సరికొత్త అవార్డుతో రతన్ టాటాను సత్కరించాలని మహారాష్ట్ర సర్కార్ నిర్ణయించుకుందని..రాష్ట్ర పరిశ్రమల శాఖ మంత్రి ఉదయ్ సమంత్ అనౌన్స్ చేశారు.

ప్రతిష్టాత్మకమైన ఉద్యోగ రత్న అవార్డును ప్రవేశపెట్టడానికి ఈ ఏడాది నుంచి.. మహారాష్ట్ర సర్కార్ నిర్ణయించింది. విశిష్ట వ్యక్తులకు అందించే.. ఈ అత్యున్నత రాష్ట్ర గౌరవాన్ని.. మహారాష్ట్ర భూషణ్ అవార్డు సంప్రదాయాన్ని అనుసరిస్తూ.. ఈ ఇయర్ నుంచి ప్రతిష్టాత్మకమైన ఉద్యోగ రత్న అవార్డును ప్రవేశపెట్టడానికి మహారాష్ట్ర ప్రభుత్వం డెసిషన్ తీసుకుంది. మహారాష్ట్ర సీఎం ఏక్‌నాథ్ షిండే, డిప్యూటీ సీఎం దేవేంద్ర ఫడ్నవీస్‌తో పాటు డిప్యూటీ సీఎం అజిత్ పవార్‌ పాల్గొన్న సమావేశంలో.. ఈ ఇయర్ బిజినెస్ మాగ్నెట్ అయిన రతన్ టాటాను తొలి ఉద్యోగ రత్న అవార్డుకు ఎంపిక చేశారు.

యంగ్ పారిశ్రామికవేత్త, ఉమెన్ పారిశ్రామికవేత్త, మరాఠీ పారిశ్రామికవేత్తలకు కూడా మహా సర్కార్ ఈ అవార్డులను అందించబోతోంది.మహారాష్ట్ర ఉద్యోగ రత్న అవార్డును.. బిజినెస్,ఇండస్ట్రీస్, ఎడ్యుకేషన్, రియల్ ఎస్టేట్, టూరిజం, ఫ్యాషన్, ఎలక్ట్రానిక్స్, వ్యవసాయం, బ్యాంకింగ్, ఐటీ, ఆహార రంగాలలో.. విశిష్టమైన కృషి చేసిన వ్యక్తులతో పాటు ఆయా సంస్థల ప్రయత్నాలను గుర్తించడానికి ఈ అవార్డులను అందించే ప్రయత్నం చేస్తోంది మహా సర్కార్. ఇలాగే ఇప్పుడు ఈ అవార్డును అందుకోవడానికి తొలి గ్రహీత టాటా గ్రూపు నిలిచింది.

ఇప్పుడు రతన్ టాటా ఈ తొలి అవార్డు దక్కించుకోవడంపై దేశమంతటా ప్రశంసల జల్లు కురుస్తోంది.మరోవైపు లెజెండ్‌కు వరించిన మహా అవార్డుపై ఇండస్ట్రియల్ వర్గాలు కూడా హర్షం వ్యక్తం చేస్తున్నాయి. రతన్ టాటా తన కెరీర్‌లో ఎన్నో ఇతర ప్రశంసలతో పాటు, భారతదేశ అత్యంత ప్రతిష్టాత్మకమైన 2 పౌర పురస్కారాలను దక్కించుకున్నారన్న విషయం తెలిసిందే.2008లో పద్మవిభూషణ్, 2000లో పద్మభూషణ్‌ అవార్డును రతన్ టాటా అందుకున్నారు.

సాల్ట్ నుంచి విమానాల దా​కా సర్వీసులందిస్తూ.. దేశంలోని అతిపెద్ద వ్యాపార సామ్రాజ్యాల్లో టాటా గ్రూపును నిలిపారు రతన్ టాటా.టీసీఎస్‌, టాటా ఎయిరిండియా వంటి ఎన్నో సంస్థల ద్వారా లక్షలాది మందికి ఉపాధి కల్పిస్తోన్నారు. ఇప్పటికీ గ్రూపు గౌరవ ఛైర్మన్‌గా కొనసాగుతున్న రతన్‌ టాటా.. సామాన్యుడిలా జీవించే విధానానికి ఆయనకు అంతా హ్యాట్సాప్ చెబుతూనే ఉంటారు. సింప్లిసిటీకి సూటు, బూటు వేస్తే ఎలా ఉంటుందో చెప్పడానికి రతన్ టాటా ప్రత్యక్ష ఉదాహరణ అంటారు. అందుకే ఆయన, ఆయన లైఫ్ స్టైల్ ఎంతోమందికి స్ఫూర్తి దాయకం అంటారు ఎంతోమంది.

మ్యాంగో న్యూస్ లింక్స్:

టెలీగ్రామ్ : https://t.me/mangonewsofficial

గూగుల్ ప్లే స్టోర్ : https://bit.ly/2R4cbgN

ఆపిల్/ఐఓఎస్ స్టోర్ : https://apple.co/2xE

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

nine − one =