ఐటీ ఉద్యోగులకు స్పెషల్ లాగౌట్స్ మరో రెండు వారాలు పొడిగింపు

Cyberabad CP Stephen Ravindra Announces Special Logouts For IT Employees Extended Upto Another Two Weeks Due to Heavy Rains,Cyberabad CP Stephen Ravindra Announces Special Logouts,Special Logouts For IT Employees,Special Logouts For IT Employees Extended,IT Employees Extended Upto Another Two Weeks,Logouts For IT Employees Extended Due to Heavy Rains,Mango News,Mango News Telugu,Cyberabad police suggest different logout times,Cyberabad CP Stephen Ravindra,Hyderabad rains,Special logouts for IT employees, Special logouts extended for another two weeks, IT employees, CP Stephen Ravindra,Cyberabad CP Stephen Ravindra Latest News,Cyberabad CP Stephen Ravindra Latest Updates,Cyberabad CP Stephen Ravindra Live News

భారీ వర్షాలతో భాగ్యనగరం అల్లాడుతోంది. గుంతలమయం అయిన రోడ్ల మధ్య వర్షం నీటిలో ప్రయాణం అంటేనే వాహనదారులకు చుక్కలు కనిపిస్తున్నాయి. దీనికి తోడు అన్ని ఆఫీసు టైమింగ్స్ ఒకటే అయితే గంటల కొద్దీ ట్రాఫిక్ లోనే గడిపాల్సిన పరిస్థితి ఉంటుంది. వర్షంలోనే నానుతూ.. ట్రాఫిక్ నుంచి బయటపడటం అంటే ప్రతీ రోజు కూడా దినదినగండంగానే ఉంటుంది. అందులోనూ ఐటీ కారిడార్‌లో ఈ ట్రాఫిక్ సమస్య మరీ ఎక్కువగా ఉంటుంది.

దీనికి పరిష్కారం కోసమే ప్రత్యామ్నాయ చర్యలు చేపట్టారు హైదరాబాద్ నగర్ పోలీసులు. భారీ వానలతో పెరుగుతోన్న ట్రాఫిక్ రద్దీని దృష్టిలో పెట్టుకుని రీసెంట్‌గా ఐటీ కారిడార్‌లోని కంపెనీలకు మూడు దశల్లో లాగ్ అవుట్ చేసుకోవాలని.. ఆ కంపెనీలకు సూచించారు. అయితే.. తాజాగా మరోసారి ఐటీ ఉద్యోగులకు కేటాయించిన స్పెషల్ లాగౌట్ సమయాన్ని.. మరో రెండు వారాలు పొడిగించినట్లు సైబరాబాద్ సీపీ స్టీఫెన్ రవీంద్ర (Stephen Ravindra) అనౌన్స్ చేశారు.

రాబోయే రోజుల్లోనూ భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని వాతావరణ శాఖ హెచ్చరించడంతో.. ఐటీ కంపెనీల పనివేళల్లో మరోసారి తగిన మార్పులు చేసుకోవాలని యాజమాన్యాలకు సూచించారు. మూడు దశల్లో ఉద్యోగులు డ్యూటీలు ముగించుకునేలా.. ఐటీ కంపెనీలకు సూచనలు చేశారు. ఫేజ్ – 1 ఏమో.. ఐకియా నుంచి సైబరాబాద్ టవర్స్ వరకు ఉండే ఐటీ ఆఫీసులన్నీ సాయంత్రం మూడు గంటలకు లాగ్ ఔట్ చేసుకోవాలి. ఫేజ్ – 2 ఏమో ఐకియా నుంచి బయో డైవర్సిటీతో పాటు రాయదుర్గం వరకు ఉండే ఐటీ ఆఫీసులన్నీ సాయంత్రం 4:30 గంటలకు లాగ్ ఔట్ చేయాలి. అలాగే ఫేజ్ – 3 ఏమో.. ఫైనాన్షియల్ డిస్ట్రిక్ట్, గచ్చిబౌలి ప్రాంతాల్లో ఉండే ఐటీ ఆఫీసులన్నీ సాయంత్రం మూడు గంటలకు లాగ్ ఔట్ చేసుకోవాలని సైబరాబాద్‌ పోలీసు అధికారులు ఆదేశాలు జారీ చేశారు.

భారీ వర్షాల వల్ల హైదరాబాద్ లోని వివిద ప్రాంతాల్లో ప్రస్తుత పరిస్థితులు, సహాయక చర్యలపై.. కమిషనరేట్‌లోని పబ్లిక్ సేఫ్టీ ఇంటిగ్రేటెడ్ ఆపరేషన్ సెంటర్‌లో సమీక్ష నిర్వహించారు.అలాగే సీసీ కెమెరాల ద్వారా కొన్ని చెరువుల్లో.. ప్రవాహ తీరును ఎలా ఉందో కూడా ట్రాఫిక్ అధికారులు పరిశీలించారు. నగరంలో చిన్నపాటి వర్షానికే భారీగా ట్రాఫిక్ జామ్ అవుతోన్నట్లు గుర్తించారు. దీంతో ఐటీ కారిడార్‌లో ట్రాఫిక్ సమస్య పరిష్కారం కోసం ఆలోచించిన ట్రాఫిక్ పోలీసులు ప్రత్యామ్నాయ చర్యలు చేపట్టారు. ఒక్కసారిగా వెహికల్స్ అన్నీ రోడ్ల మీదకు వస్తుండటంతో ట్రాఫిక్ సమస్య ఎక్కువవుతుందని గుర్తించిన పోలీసులు.. ఐటీ కంపెనీలకు కొన్ని సూచనలు చేశారు.ఇప్పుడు ఈ లాగౌట్స్ మరో రెండు వారాలపాటు అమలు కానున్నాయి.

మ్యాంగో న్యూస్ లింక్స్:

టెలీగ్రామ్ : https://t.me/mangonewsofficial

గూగుల్ ప్లే స్టోర్ : https://bit.ly/2R4cbgN

ఆపిల్/ఐఓఎస్ స్టోర్ : https://apple.co/2xE

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

seventeen − 14 =