ఐపీఎల్ 2022: నేడే రాయల్ ఛాలెంజెర్స్ బెంగళూరు, లక్నో సూపర్ జెయింట్స్ మధ్య కీలక ఎలిమినేటర్ మ్యాచ్

IPL-2022 Eliminator Match Between Royal-challengers Bangalore and Lucknow Supergiants Today, Eliminator Match Between Royal-challengers Bangalore and Lucknow Supergiants Today, Royal-challengers Bangalore and Lucknow Supergiants, IPL-2022 Eliminator Match Between RCB And LSG, Royal-challengers Bangalore, Lucknow Supergiants, Eliminator Match, IPL-2022 Eliminator Match, 2022 IPL Eliminator Match, IPL-2022, TATA IPL 2022, 2022 TATA IPL, Tata IPL, Indian Premier League, Indian Premier League News, Indian Premier League Latest News, Indian Premier League Latest Updates, Indian Premier League Live Updates, Cricket, Cricket Latest News, Cricket Live Updates, Mango News, Mango News Telugu,

ఇండియన్‌ ప్రీమియర్‌ లీగ్‌ (ఐపీఎల్‌)-2022 లో ప్లే ఆప్స్ మ్యాచులు జరుగుతున్న సంగతి తెలిసిందే. ప్లే ఆప్స్ లో భాగంగా మంగళవారం రాత్రి కోల్‌కతాలోని ఈడెన్ గార్డెన్స్ లో గుజరాత్ టైటాన్స్, రాజస్థాన్ రాయల్స్ మధ్య జరిగిన క్వాలిఫయర్‌-1 మ్యాచ్ లో గుజరాత్ జట్టు 7 వికెట్ల తేడాతో గెలిచి ఐపీఎల్ ఫైనల్ కు చేరుకుంది. ఇక ఈడెన్ గార్డెన్స్ లో ఈ రోజు సాయంత్రం 7:30 గంటలకు జరిగే కీలకమైన ఎలిమినేటర్ మ్యాచ్ లో రాయల్ ఛాలెంజెర్స్ బెంగళూరు, లక్నో సూపర్ జెయింట్స్ పోటీపడనున్నాయి. ఈ మ్యాచ్ లో గెలిచిన జట్టు ఫైనల్ కు వెళ్లేందుకు క్వాలిఫయర్‌-2 లో రాజస్థాన్ రాయల్స్ తో తలపడాల్సి వుంటుంది. ఇక ఓడిపోయిన జట్టు ఐపీఎల్-2022 నుండి నిష్క్రమించనుంది.

లక్నో సూపర్ జెయింట్స్ ఈ ఏడాదే ఐపీఎల్ లో కొత్తగా అరంగేట్రం చేసిన సంగతి తెలిసిందే. ఈ జట్టుకు కెప్టెన్ గా టీమిండియా స్టార్ బ్యాటర్ కేఎల్ రాహుల్ వ్యవహరిస్తుండగా, ఈ సీజన్ లో ఇప్పటివరకు ఈ జట్టు మంచి విజయాలను నమోదు చేసింది. మొత్తం 14 లీగ్ మ్యాచుల్లో లక్నో సూపర్ జెయింట్స్ 9 విజయాలు సాధించి 18 పాయింట్స్, +0.251 నెట్ రన్ రేటుతో పాయింట్స్ టేబుల్ లో మూడో స్థానంలో నిలిచి ప్లేఆఫ్స్‌కు అర్హత సాధించింది. లక్నో జట్టులో కెప్టెన్ కేఎల్ రాహుల్, క్విన్టన్ డికాక్, దీపక్ హుడా బ్యాటింగ్ లో రాణిస్తుండగా, అవేశ్ ఖాన్, హోల్డర్, స్టోయినిస్ బౌలింగ్ లో సత్తా చాటుతున్నారు. ఇక రాయల్ ఛాలెంజెర్స్ జట్టు కూడా 14 లీగ్ మ్యాచుల్లో 8 విజయాలు సాధించి 16 పాయింట్స్, -0.253 నెట్ రన్ రేటుతో పాయింట్స్ టేబుల్ లో నాలుగో స్థానంలో నిలిచి ప్లేఆఫ్స్‌కు అర్హత సాధించింది. బెంగళూరు జట్టులో కెప్టెన్ డుప్లెసిస్, విరాట్ కోహ్లీ, దినేష్ కార్తీక్, మాక్స్ వెల్ మెరుగైన ప్రదర్శనపైనే ఎక్కువుగా విజయావకాశాలు ఆధారపడి ఉన్నాయి. క్వాలిఫయర్‌-2 పోరులో ఏ జట్టు నిలుస్తుందో మరికొద్ది గంటల్లో తేలనుంది.

రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు (తుదిజట్టు అంచనా): ఫాఫ్ డు ప్లెసిస్ (కెప్టెన్), విరాట్ కోహ్లి, రజత్ పాటిదార్, గ్లెన్ మాక్స్‌వెల్, మహిపాల్ లోమ్రోర్, దినేష్ కార్తీక్ (వికెట్ కీపర్), షాబాజ్ అహ్మద్, వనిందు హసరంగా, హర్షల్ పటేల్, జోష్ హేజిల్‌వుడ్, మహమ్మద్ సిరాజ్.

లక్నో సూపర్ జెయింట్స్ (తుదిజట్టు అంచనా): కేఎల్ రాహుల్ (కెప్టెన్), క్వింటన్ డి కాక్ (వికెట్ కీపర్), దీపక్ హుడా, కృనాల్ పాండ్యా, ఆయుష్ బదోని, మార్కస్ స్టోయినిస్, జాసన్ హోల్డర్, అవేష్ ఖాన్, దుష్మంత చమీర, మొహిసిన్ ఖాన్, రవి బిష్ణోయ్.

 

మ్యాంగో న్యూస్ లింక్స్:

టెలీగ్రామ్ : https://t.me/mangonewsofficial

గూగుల్ ప్లే స్టోర్ : https://bit.ly/2R4cbgN

ఆపిల్/ఐఓఎస్ స్టోర్ : https://apple.co/2xEYF

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

four × one =