నేటి నుంచే ఐపీఎల్ 15వ సీజన్ ప్రారంభం, టైటిల్‌ కోసం పోటీపడనున్న పది జట్లు

IPL-2022 Starts From Today First Match Between Chennai Super Kings and Kolkata Knight Riders, IPL-2022 Starts From Today, First Match Between Chennai Super Kings and Kolkata Knight Riders, Chennai Super Kings and Kolkata Knight Riders, Chennai Super Kings, Kolkata Knight Riders, IPL-2022, 2022 IPL, TATA IPL 2022, 2022 TATA IPL, Tata IPL, ‎IPL 2022 Schedule, ‎IPL Schedule , 2022 Indian Premier League, Indian Premier League, Indian Premier League Latest News, Indian Premier League Latest Updates, Indian Premier League Live Updates, IPL 2022 Starts From March 26, IPL 2022 Final May 29, CSK And KKR, Mango News, Mango News Telugu,

ఇండియన్‌ ప్రీమియర్‌ లీగ్‌ (ఐపీఎల్‌)-2022 మరికొద్ది గంటల్లో ఘనంగా ప్రారంభం కానుంది. ముంబయిలోని వాంఖడే స్టేడియంలో 2021 ఐపీఎల్ విజేత‌ చెన్నై సూపర్ కింగ్స్, రన్నర్స్-అప్ కోల్‌కతా నైట్ రైడర్స్ మధ్య శనివారం రాత్రి 7.30 గంటలకు జరగనున్న తొలి మ్యాచ్ తో క్రీడాభిమానులు ఎంతగానో ఎదురుచూస్తున్న ఐపీఎల్ 15వ సీజన్ ప్రారంభం కానుంది. నేడు ప్రారంభమయ్యే ఐపీఎల్ లీగ్ మ్యాచులు మే 22తో ముగియనుండగా, మే 29న జరగనుంది. ప్లేఆఫ్‌ మ్యాచుల షెడ్యూల్ త్వరలో ప్రకటించనున్నట్టు బీసీసీఐ వెల్లడించింది. భారత కాలమానం ప్రకారం ఐపీఎల్ మ్యాచులు రాత్రి 7.30 గంటలకు, ‌మరియు మధ్యాహ్నం 3:30 గంటలకు జరగనున్నాయి.

కాగా ఈ ఐపీఎల్‌ నుంచి కొత్తగా మరో రెండు జట్లు చేరుతున్న సంగతి తెలిసిందే. కొత్తగా చేరిన లక్నో సూపర్ జెయింట్స్, గుజరాత్ టైటాన్స్ జట్లతో కలిపి మొత్తం 10 జట్లు ఈ ఐపీఎల్ లో టైటిల్‌ కోసం పోటీపడనున్నాయి. మొత్తం 65 రోజుల వ్యవధిలో 70 లీగ్ మ్యాచ్‌లు మరియు 4 ప్లేఆఫ్ గేమ్స్ జరగనున్నాయి. అలాగే ఈసారి ఐపీఎల్ లీగ్ మ్యాచ్‌లు పూర్తిగా మహారాష్ట్రలోనే జరగనున్నాయి. ముంబయిలోని వాంఖడే స్టేడియంలో 20, నావీ ముంబయిలోని డివై పాటిల్ స్టేడియంలో 20, బ్రబౌర్న్ స్టేడియంలో 15, మరియు పూణే గహుంజేలోని మహారాష్ట్ర క్రికెట్ అసోసియేషన్ (ఎంసీఏ) గ్రౌండ్‌లో 15 మ్యాచులు నిర్వహించనున్నారు.

కరోనా మహమ్మారి పరిస్థితుల అనంతరం ఐపీఎల్ మ్యాచులకు ప్రేక్షకులను అనుమతించేందుకు భారత క్రికెట్ నియంత్రణ మండలి (బీసీసీఐ) నిర్ణయం తీసుకుంది. కోవిడ్-19 ప్రోటోకాల్‌ అనుసరించి స్టేడియం సామర్థ్యంలో 25 శాతం ఆక్యుపెన్సీతో ప్రేక్షకులను అనుమతించనున్నట్టు తెలిపారు. కరోనా పరిస్థితులు దృష్ట్యా మ్యాచుల నిర్వహణ, ఆటగాళ్ల భద్రతా విషయంలో మరిన్ని జాగ్రత్తలు, కట్టుదిట్టమైన చర్యలు తీసుకుంటూ, ఈ సీజన్ విజయవంతంగా నిర్వహించేందుకు బీసీసీఐ అన్ని ఏర్పాట్లు చేసింది. ఎప్పటిలాగానే ఈ ఐపీఎల్ సీజన్ పై కూడా భారీ హైప్ నెలకుంది. ఈ ఐపీఎల్ లో ఎలాంటి సంచనాలు నమోదుకాబోతాయో, ఏ జట్టు విజేతగా నిలుస్తుందో వేచిచూడాలి.

ఐపీఎల్‌-2022 వివరాలు:‌

  • ప్రారంభ తేదీ – మార్చి 26
  • ఫైనల్స్ – మే 29
  • మ్యాచుల సమయాలు: మధ్యాహ్నం గం.3.30, రాత్రి గం.7.30
  • వేదికలు: ముంబయి, నావీ ముంబయి, పూణే

2008 నుంచి 2021 వరకు ఐపీఎల్ విన్నర్స్ జాబితా:

  • ఐపీఎల్ విజేత 2008: రాజస్థాన్ రాయల్స్
  • ఐపీఎల్ విజేత 2009: డెక్కన్ ఛార్జర్స్
  • ఐపీఎల్ విజేత 2010: చెన్నై సూపర్ కింగ్స్
  • ఐపీఎల్ విజేత 2011: చెన్నై సూపర్ కింగ్స్
  • ఐపీఎల్ విజేత 2012: కోల్‌కతా నైట్ రైడర్స్
  • ఐపీఎల్ విజేత 2013: ముంబై ఇండియన్స్
  • ఐపీఎల్ విజేత 2014: కోల్‌కతా నైట్ రైడర్స్
  • ఐపీఎల్ విజేత 2015: ముంబై ఇండియన్స్
  • ఐపీఎల్ విజేత 2016: సన్‌రైజర్స్ హైదరాబాద్
  • ఐపీఎల్ విజేత 2017: ముంబై ఇండియన్స్
  • ఐపీఎల్ విజేత 2018: చెన్నై సూపర్ కింగ్స్
  • ఐపీఎల్ విజేత 2019: ముంబై ఇండియన్స్
  • ఐపీఎల్ విజేత 2020: ముంబై ఇండియన్స్
  • ఐపీఎల్ విజేత 2021: చెన్నై సూపర్ కింగ్స్

 

మ్యాంగో న్యూస్ లింక్స్:

టెలీగ్రామ్ : https://t.me/mangonewsofficial

గూగుల్ ప్లే స్టోర్ : https://bit.ly/2R4cbgN

ఆపిల్/ఐఓఎస్ స్టోర్ : https://apple.co/2xEYFJ

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

13 + 7 =