ఐపీఎల్-2022: సన్ రైజర్స్ హైదరాబాద్ కొత్త జెర్సీ ఆవిష్కరణ

IPL 2022, IPL 2022 auction, IPL 2022 mega auction, IPL 2022 Mega Auction News, IPL 2022 New Franchise, IPL 2022 News, IPL 2022 Player Auction, IPL 2022 Player Mega Auction, IPL 2022 Updates, IPL Sunrisers Hyderabad, Mango News, Sunrisers Hyderabad, Sunrisers Hyderabad IPL, Sunrisers Hyderabad Unveils New Jersey, Sunrisers Hyderabad Unveils New Jersey ahead of Mega Auction

ఇండియన్ ప్రీమియర్ లీగ్ (ఐపీఎల్)-2022లో సన్ రైజర్స్ హైదరాబాద్ (ఎస్‌ఆర్‌హెచ్‌) ఆటగాళ్లు సరికొత్త జెర్సీలో కనిపించనున్నారు. ఫిబ్రవరి 9, బుధవారం సాయంత్రం సన్‌రైజర్స్ హైదరాబాద్ యాజమాన్యం తమ జట్టు యొక్క కొత్త జెర్సీని ఆవిష్కరించింది. ఆరెంజ్ ఆర్మీ కోసం ఆరెంజ్ ఆర్మర్ అంటూ అధికారిక ట్విట్టర్ ఖాతాలో కొత్త జెర్సీని పోస్ట్ చేసింది. కొత్త జెర్సీ అభిమానులను విశేషంగా ఆకట్టుకుంటుంది.

మరోవైపు ఐపీఎల్-2022 ఆటగాళ్ల మెగా వేలానికి ముందే ముగ్గురుని సన్‌రైజర్స్ హైదరాబాద్ యాజమాన్యం రిటైన్ చేసుకున్న సంగతి తెలిసిందే. కెప్టెన్ కేన్ విలియంసన్, అబ్దుల్ సమద్, ఉమ్రాన్ మాలిక్ ను రిటైన్ చేసుకున్నారు. అలాగే తన కొత్త కోచింగ్ స్టాఫ్ ను కూడా సన్‌రైజర్స్ హైదరాబాద్ ఇటీవలే ప్రకటించింది. హెడ్ కోచ్ ట్రావిస్ బైలిస్ స్థానంలో ఆస్ట్రేలియన్ మాజీ క్రికెటర్ టామ్ మూడీని నియమించారు. సైమన్ కటిచ్ ను టామ్ మూడీకి డిప్యూటీగా నియమించారు. ఇక ఎస్‌ఆర్‌హెచ్‌ బ్యాటింగ్ కోచ్ గా వెస్టిండీస్ మాజీ కెప్టెన్ బ్రియాన్ లారా, పేస్ బౌలింగ్ కోచ్‌ గా దక్షిణాఫ్రికా ఫాస్ట్ బౌలర్ డేల్ స్టెయిన్ నియమించబడ్డారు. ఇప్పటివరకు బౌలింగ్ కోచ్ గా ఉన్న శ్రీలంక మాజీ బౌలర్ ముత్తయ్య మురళీధరన్‌ను ఇకపై స్ట్రాటజీ మరియు స్పిన్ బౌలింగ్ కోచ్‌గా కొనసాగనున్నారు. మరోవైపు హేమంగ్ బదానీని ఫీల్డింగ్ కోచ్‌గా, స్కౌట్ గా ఎంపిక చేశారు.

మ్యాంగో న్యూస్ లింక్స్:

టెలీగ్రామ్ : https://t.me/mangonewsofficial

గూగుల్ ప్లే స్టోర్ : https://bit.ly/2R4cbgN

ఆపిల్/ఐఓఎస్ స్టోర్ : https://apple.co/2xEYFJ

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

three × 2 =