రైల్వే స్టేషన్‌లో తక్కువ ధరకే రూమ్స్ ఉంటాయని తెలుసా!

IRCTC Providing Retiring Rooms at Low Cost in The Railway Stations Heres Know The Room Booking Process,IRCTC Providing Retiring Rooms,Retiring Rooms at Low Cost in The Railway Stations,Know The Room Booking Process,IRCTC Room Booking Process,Mango News,Mango News Telugu,IRCTC Retiring Rooms in The Railway Stations,IRCTC Retiring Rooms Latest News,IRCTC Retiring Rooms Latest Updates,IRCTC Room Booking Process Latest News,IRCTC Latest News,IRCTC Latest Updates,Railway Station Retiring Rooms Live Updates

ఇండియన్స్ చాలామంది దూరపు ప్రయాణాల కోసం ట్రైన్ జర్నీ చేయడానికే ఇష్టపడతారు. మిగిలిన వాటితో పోలిస్తే ధర కాస్త తక్కువ.. కంఫర్ట్ అండ్ సేఫ్ జర్నీ కావడంతో ఎక్కువ మంది రైలు ప్రయాణానికే (Train Journey) ఓటేస్తారు. అయితే ఇలా ప్రయాణిస్తున్నప్పుడు వేరే ట్రైన్ పట్టుకోవడానికి మధ్యలో దిగే ప్రయాణికులు.. కనీస అవసరాలు తీర్చుకోవడానికి చాలా ఇబ్బందులు పడతారు. అలా అని చెప్పి బయటకు వెళ్లి ఓ హోటలో బుక్ చేసుకుందామన్నా.. 4,5 గంటలకు కూడా వేలల్లో ఖర్చు చేయాల్సి ఉంటుంది. ఇలాంటి వారికోసం రైల్వే శాఖ (Railway Department) కొన్ని సదుపాయాలను తీసుకువచ్చింది.

నిజానికి ట్రైన్ జర్నీ చేసేవాళ్లు స్టేషన్‌లో ఎక్కువ సమయం వెయిట్ చేయాల్సి వచ్చినప్పుడు కొంత మంది ప్లాట్‌ఫామ్ (PlatForm) మీదే ఉండిపోతారు. మరి కొంత మంది దగ్గరలో ఉన్నహోటల్ రూమ్స్ కోసం వెళతారు. కానీ రైల్వే స్టేషన్ల (Railway Stations)లోనే అలాంటి సదుపాయాలు ఉంటాయని.. అతి తక్కువ ఖర్చుతోనే రూమ్ బుక్ చేసుకోవచ్చని చాలామందికి తెలియదు.

రిటైరింగ్ రూమ్స్ రేటు ఎంత?

రైల్వే స్టేషన్లలో ఏసీ, నాన్ ఏసీ గదులతో సింగిల్,డబుల్ బెడ్ రూమ్స్ (Single and Double Bed Rooms) అందుబాటులో ఉంటాయి. వీటిని రిటైరింగ్ రూమ్స్ అంటారు. అయితే డిమాండ్‌ తక్కువ ఉంటే రూ. 100 కే దొరకే రూమ్.. డిమాండ్ బట్టి కొన్నిసార్లు రూ. 700 వరకు ఉంటాయి. అయితే చాలా వరకు కేవలం వంద రూపాయలకే రూమ్ బుక్ (Room Booking) చేసుకునే అవకాశం ఇక్కడ ఉంటుంది. కానీ ఈ రూమ్స్ బుక్ చేసుకోవాలనుకునే అనుకున్నవాళ్లు.. కన్ఫమ్ అయిన తమ టిక్కెట్‌ను చూపించాల్సి ఉంటుది. లేకపోతే రూమ్ బుక్ చేసుకునే అవకాశాన్ని కోల్పోతారు. ఈ సదుపాయం చిన్న చిన్న స్టేషన్లో కాకుండా.. పెద్ద పెద్ద స్టేషన్లలోనే అందుబాటులో ఉంటాయి.

రిటైరింగ్ రూమ్స్‌ను ఎలా బుక్ చేసుకోవాలి?

టిక్కెట్ కన్ఫర్మ్ అయినవాళ్లు.. ముందుగా ఐఆర్‌సీటీసీ అధికారిక వెబ్‌సైట్‌ (IRCTC Official Website)లోకి లాగిన్ అవ్వాలి. ఆ తరువాత మై బుకింగ్స్ ఆప్షన్స్‌లోకి వెళ్తే.. టిక్కెట్ బుకింగ్ కింద రిటైరింగ్ రూమ్స్ అనే ఒక ఆప్షన్ కనిపిస్తుంది. ఆ ఆప్షన్ పైన క్లిక్ చేయగానే రూమ్ బుక్ చేసుకునే ఆప్షన్ కనిపిస్తుంది. అప్పుడు ఆ ఆప్షన్‍లో ఉండే మీ టిక్కెట్ పీఎన్ఆర్ నెంబర్ ద్వారా .. మీరు ఏ స్టేషన్‌లో ఉండాలనుకుంటున్నారనే ఆప్షన్‌ను ఎంచుకోవాలి. అక్కడ ప్యాసింజర్ పర్సనల్ ఇన్ఫర్మషన్‌తో పాటు జర్నీ టైమ్ వంటి వివరాలు ఇవ్వాల్సి ఉంటుంది. అంతేకాదు అప్పుడే చెక్ ఇన్, చెక్ అవుట్, బెడ్ టైప్, ఏసీ, నాన్ ఏసీ వంటివి సెలక్ట్ చేసుకుని బుక్ చేసుకోవాలి. రూమ్ నెంబర్, ఐడీ కార్డు టైప్ వంటి వాటిని సెలక్ట్ చేసుకున్న తరువాతే పేమెంట్ చేయాల్సి ఉంటుంది.

అయితే కొన్ని కారణాల వల్ల ప్రయాణం క్యాన్సిల్ అయితే.. బుక్ చేసుకున్న రూమ్‌ను కూడా క్యాన్సిల్ చేసుకోవచ్చు. రూమ్ బుక్ చేసిన తరువాత 48 గంటల వరకు క్యాన్సిల్ చేసుకునే సదుపాయం ఉంటుంది. ఒక వేళ 48 గంటలు కానీ అంతకంటే తక్కువ టైములోనే క్యాన్సిల్ చేసుకుంటే 10 శాతం తగ్గింపు ఉంటుంది. అదే రూమ్ తీసుకునే రోజే క్యాన్సిల్ చేసుకుంటే 50 శాతం తగ్గించి మిగిలిన మనీ మీ అకౌంట్‌లోనే జమ అవుతుంది. అయితే తక్కువ అమౌంట్ కావడంతో క్యాన్సిలేషన్స్ చాలా తక్కువ ఉంటాయి.

మ్యాంగో న్యూస్ లింక్స్:

టెలీగ్రామ్ : https://t.me/mangonewsofficial

గూగుల్ ప్లే స్టోర్ : https://bit.ly/2R4cbgN

ఆపిల్/ఐఓఎస్ స్టోర్ : https://apple.co/2xE

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

3 × five =