గుడ్ న్యూస్… కేవలం రూ.999 కే జియో భారత్ 4జీ ఫోన్

Jio Launches Jio Bharat 4G Phone at Only Rs 999 To Drive 2G Mukt India,Jio Launches Jio Bharat 4G Phone,Jio Bharat 4G Phone at Only Rs 999,Jio To Drive 2G Mukt India,Mango News,Mango News Telugu,Jio launches Jio Bharat 4G,4G Phone at Only Rs 999,Jio Bharat 4G Phone,Reliance Jio launches Jio Bharat phone,Jio Bharat 4G phone launched,Reliance Unveils Jio Bharat 4G Phone,Twoji Mukt Bharat,Jio Bharat 4G Phone Latest News,Jio Bharat 4G Phone Latest Updates,Jio Bharat 4G Phone Live News,Jio Launches Jio Bharat News Today,Jio Launches Jio Bharat Live Updates

రిలయన్స్ జియో తాజాగా మరో సంచలనం క్రియేట్ చేసింది. కేవలం రూ.999కే జియో భారత్ (Jio Bharat) 4జీ ఫోన్‌ను లాంఛ్ చేసింది. ఇది ఇంటర్నెట్ ఎనేబుల్డ్ ఫీచర్ ఫోన్ అని చెబుతూనే.. జియో భారత్ ప్లాన్స్‌ను కూడా ప్రకటించింది.

జియో భారత్ ప్లాన్స్‌..

జియో భారత్ ఫోన్ (Jio Bharat Phone) ఇయర్లీ సబ్‌స్క్రిప్షన్ కేవలం రూ.1,234 మాత్రమే. అలాగే మంత్లీ సబ్‌స్క్రిప్షన్ రూ.123. ఈ ప్లాన్స్ తీసుకున్నవారికి అన్‌లిమిటెడ్ వాయిస్ కాల్స్‌తో పాటు.. నెలకు 14 జీబీ డేటా ఫ్రీగా ఇస్తారు. అయితే జులై 7న మొదటి 10 లక్షల మందికి జియో భారత్ ఫోన్ బీటా ట్రయల్ ప్రారంభం అవుతుంది. మిలియన్ల కొద్దీ ఫీచర్ ఫోన్ వినియోగదారులను అప్‌గ్రేడ్ చేయడానికి ప్లాట్‌ఫారమ్, ప్రోసెస్ స్కేలబిలిటీని అంచనా వేయడానికి 6,500 మండలాల్లో బీటా ట్రయల్ కొనసాగతుంది.

నిజానికి రిలయన్స్ జియో చాలా కాలం క్రితం.. ‘2జీ-ముక్త్ భారత్’ (2G-Free India) అంటూ ఓ నినాదాన్ని ప్రకటించింది. దీనికి అనుగుణంగా ‘జియో భారత్’ ఫోన్ ఈ విజన్‌ను ఇప్పుడు మరింత స్పీడప్ చేయనుంది. ఇప్పటికే ఉన్న 250 మిలియన్ ఫీచర్‌ను.. ఇప్పుడు ఫోన్ వినియోగించే ఇంటర్నెట్ ఎనేబుల్ ఫోన్‌లను ఇంట్రడ్యూస్ చేయడమే జియో భారత్ టార్గెట్‌గా పెట్టుకుంది.

జియో భారత్ ప్రత్యేకతలు..

జియో భారత్ ఫోన్ ధర కేవలం 999 మాత్రమే. ఇంటర్నెట్ చవకగా లభించే ఫోన్.. జియో భారత్. ఇతర ఆపరేటర్ల ఫీచర్ ఫోన్ ఆఫర్‌లతో పోలిస్తే 30 శాతం చౌకగా మంత్లీ ప్లాన్లతో పాటు.. 7 రెట్లు ఎక్కువ డేటా అందిస్తోంది జియో భారత్ (Jio Bharat). ఒకవేళ రూ.123 ప్లాన్ సెలక్ట్ చేసుకుంటే అన్‌లిమిటెడ్ వాయిస్ కాల్స్, 14జీబీ డేటా వస్తుంది. కానీ వేరే ఆపరేటర్లు రూ.179 ప్లాన్‌కు వాయిస్ కాల్స్, 2జీబీ డేటాను మాత్రమే అందిస్తూ వస్తున్నాయి.

జియో భారత్ ఫోన్‌ (Jio Bharat Phone)లో ఇంకా చాలా ఇంట్రెస్టింగ్ ఫీచర్స్ ఉన్నాయి. జియో భారత్ వీ2 ఫోన్ బరువు కేవలం 71 గ్రాములు మాత్రమే ఉంటుంది. ఇది మేడ్ ఇన్ ఇండియా ఫోన్‌గా ఉండటం వల్ల.. 4జీ నెట్వర్క్ సపోర్ట్ చేస్తుంది. దీంతో హెచ్‌డీ వాయిస్ కాలింగ్ చేసుకోవడానికి ఈజీగా ఉంటుంది. 128జీబీ మెమొరీ కార్డ్ సపోర్ట్ కూడా ఉంది. అంతేకాదు 0.3 మెగాపిక్సెల్ కెమెరా, 3.5 ఎంఎం జాక్, 1000 ఎంఏహెచ్ బ్యాటరీ వంటి ఫీచర్స్ ఉన్నాయి. టార్చ్, లౌడ్ స్పీకర్ సపోర్ట్ ఎలాగూ ఉంటుంది.

జియో భారత్ ఫోన్లు.. బ్లాక్, బ్లూ కలర్స్‌లో మార్కెట్లోకి వస్తుంది. డిజిటల్ పేమెంట్స్‌‌ను ఎంకరేజ్‌ చేయడానికి.. జియోపే యాప్ ఉపయోగించి యూపీఐ పేమెంట్స్ ఫీచర్‌ను కూడా అందుబాటులో ఉంచారు. ఇక అంతా ఇష్టపడే.. ఎంటర్‌టైన్‌మెంట్ విషయానికి వస్తే.. జియో సినిమా యాప్ ద్వారా నచ్చిన సినిమాలు చూడొచ్చు. వీడియోలు, స్పోర్ట్స్ హైలైట్స్ కూడా చూడొచ్చు.

జియో భారత్ ఫోన్‌తో రిలయన్స్ జియో.. ఎంట్రీ-లెవల్ ఫోన్‌లో ఇంటర్నెట్ సర్వీసులను అందించబోతోంది. రిలయన్స్ రీటైల్ మాత్రమే కాదు ఇతర ఫోన్ బ్రాండ్స్ కూడా జియో భారత్ ప్లాట్‌ఫామ్ ద్వారా.. జియో భారత్ ఫోన్లను తయారు చేయనున్నాయి. ఇప్పటికే కార్బన్ బ్రాండ్ ఈ జర్నీలో యాడ్ అయింది.

ఈ యూజర్లకు జియో సావన్ యాప్ యాక్సెస్ కూడా ఉంటుంది. వేర్వేరు లాంగ్వేజెస్‌కు చెందిన 8 కోట్లకు పైగా పాటలు వినొచ్చు. ఎఫ్ఎం రేడియో యాక్సెస్ కూడా ఉంది. తెలుగు, హిందీ సహా 22 భారతీయ భాషల్లో జియో భారత్ ఫోన్‌ (Jio Bharat Phone)ను ఉపయోగించవచ్చు.

మ్యాంగో న్యూస్ లింక్స్:

టెలీగ్రామ్ : https://t.me/mangonewsofficial

గూగుల్ ప్లే స్టోర్ : https://bit.ly/2R4cbgN

ఆపిల్/ఐఓఎస్ స్టోర్ : https://apple.co/2xE

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

five × three =