చాలా సార్లు ఎటువంటి కారణం లేకుండానే మన ఖాతా నుంచి బ్యాంకులు డబ్బును కట్ చేస్తూ ఉంటాయి. అప్పుడు అకౌంట్ మైనస్‌గా మారుతుంది. దీంతో ఆ అకౌంట్‌ను క్లోజ్ చేసుకోవడం తప్ప కస్టమర్‌కు వేరే మార్గం కనిపించదు.
దీంతో బ్యాంకుకు వెళ్లి అకౌంట్ క్లోజ్ చేయమని బ్యాంకు అధికారులను అడిగినప్పుడు.. ఆ అకౌంట్ క్లోజ్ చేయకపోగా, మైనస్ అమౌంట్ క్లియర్ చేసిన తర్వాతే మీ అకౌంట్ క్లోజ్ చేసుకోవచ్చని చెబుతుంటారు. ఇలాంటప్పుడు ఏం చేయాలో తెలియక కంగారు పడతాం. అయితే మినిమం బ్యాలెన్స్ గోల వదిలించుకోవడానికి ఫైన్ కట్టేసి ఆ అకౌంట్ క్లోజ్ చేసుకుంటారు. కానీ అలా ఫైన్ కట్టక్కరలేదని భారతీయ రిజర్వ్ బ్యాంక్ చెబుతోంది.
ఇప్పుడు చాలామంది సేవింగ్స్ బ్యాంక్ అకౌంట్‌కు ప్రాధాన్యత ఇస్తున్నారు. సేవింగ్స్ అకౌంట్‌ను ఓపెన్ చేసినప్పుడు, బ్యాంక్ అకౌంట్ తెరిచిన తర్వాత ఖాతాలో మినిమం బ్యాలెన్స్ కోసం నిర్వహించాల్సిన రూల్స్, కండిషన్లను బ్యాంక్ తన కస్టమర్లకు చెబుతుంది. కనీస బ్యాలెన్స్ పరిమితిని కూడా బ్యాంకు స్వయంగా డిసైడ్ చేస్తుంది. అలా అకౌంట్ హోల్డర్ ఖాతాలో కనీస నిల్వ లేకపోతే ఆ బ్యాంకు జరీమానా విధిస్తుంటుంది .
కానీ ఆర్బీఐ నిబంధనల ప్రకారం మినిమమ్ బ్యాలెన్స్ లేకపోయినా కూడా అకౌంట్ హోల్డర్ ఖాతా నుంచి బ్యాంకు డబ్బును తీసివేయకూడదు. అంతేకాదు పెనాల్టీ పేరుతో కోత విధించి బ్యాంకు ఖాతాదారుని అకౌంట్‌ను నెగిటివ్ చేయకూడదు. అయినా సరే..ఏదైనా బ్యాంకు ఇలా చేస్తే మాత్రం, కస్టమర్ ఆర్బీఐకి వెళ్లి బ్యాంకుపై కంప్లైంట్ చేయవచ్చు.
మీ కంప్లైంట్ ఆధారంగా ఆర్బీఐ ఆ బ్యాంకుపై యాక్షన్ తీసుకుంటుంది. దీనికోసం ఆర్బీఐ అధికారిక వెబ్‌సైట్‌ను సందర్శించి అయినా డైరక్టుగా ఆఫీసుకు వెళ్లి అయినా సరే ఫిర్యాదు చేయవచ్చు. అలాగే కొన్నిసార్లు ఆయా బ్యాంకులకు ఫిర్యాదు చేసినా కూడా మీ సమస్యకు పరిష్కారం దొరుకుతుంది. దీనికోసం మీరు ఆ బ్యాంకుల కస్టమర్ కేర్‌తో మాట్లాడి మీ సమస్య చెప్పాలి. బ్యాంకులు అప్పటి వరకూ కట్టిన మొత్తాన్ని కూడా రిటర్న్ చేస్తాయి.
మ్యాంగో న్యూస్ లింక్స్:
టెలీగ్రామ్ : https://t.me/mangonewsofficial
గూగుల్ ప్లే స్టోర్ : https://bit.ly/2R4cbgN
ఆపిల్/ఐఓఎస్ స్టోర్ : https://apple.co/2xEY