చంద్రయాన్‌ -3 సక్సెస్‌‌పై ఊహించని అభినందనలు

ISRO Chief S Somanath Receives Heartfelt Welcome in IndiGo Flight on Chandrayaan-3 success,ISRO Chief S Somanath Receives Heartfelt Welcome,Heartfelt Welcome in IndiGo Flight,Mango News,Mango News Telugu,Indigo welcome to ISRO chief,Indigo, Chandrayaan-3 success, ISRO Chairman Somnath, Indigo Staff,ISRO Chief S Somanath Latest News,ISRO Chief S Somanath Latest Updates,ISRO Chief S Somanath Live News,Somanath Heartfelt Welcome Latest News,Somanath Heartfelt Welcome Latest Updates

140 కోట్ల మంది భారతీయుల ఆకాంక్షలను నెరవేరుస్తూ ఆగస్టు 23న.. చంద్రయాన్‌-3 జాబిల్లి దక్షిణ ధ్రువంపై అడుగు పెట్టి చరిత్ర సృష్టించింది. దీంతో ప్రపంచవ్యాప్తంగా శాస్త్రవేత్తల కృషికి అభినందనలు వెల్లువెత్తాయి. చంద్రుడితో మీ పేరు కూడా ముడిపడి ఉందంటూ ప్రత్యేకంగా ప్రధాని మోడీ ఇస్రో ఛైర్మన్‌ సోమనాథ్‌ను.. పొగిడిన విషయం తెలిసిందే. తాజాగా ఇస్రో ఛైర్మన్‌ సోమనాథ్‌ ఇండిగో విమానంలో ప్రయాణించారు. దీంతో ఆయన విమానం ఎక్కిన వీడియోను సిబ్బంది పంచుకోగా నెట్టింట వైరల్ గా మారింది.

గురువారం ఇస్రో ఛైర్మన్‌ సోమనాథ్‌ ఇండిగో విమానంలో ప్రయాణించారు. దీంతో విమానం టేకాఫ్‌కు ముందు ఇస్రో ఛైర్మన్‌ సోమనాథ్‌ ‌ను గౌరవిస్తూ సిబ్బంది ప్రత్యేకంగా అనౌన్స్‌మెంట్‌ చేశారు. ఈ రోజు ఇండిగో విమానంలో మనతో పాటు ఒక ప్రత్యేక వ్యక్తి కూడా ఉన్నారని.. వారు బోర్టులో ఉన్నందుకు తమకు ఎంతో సంతోషంగా ఉందని అనౌన్స్ చేశారు. వారికి సేవలందించే అవకాశం రావడాన్ని తాము విశేషంగా భావిస్తున్నామని.. దేశం గర్వపడేలా చేసినందుకు ధన్యవాదాలు’ అంటూ ప్రకటించారు. దీంతో ప్రయాణికులంతా చప్పట్లతో ఇస్రో ఛైర్మన్‌ సోమనాథ్‌ కు అపూర్వ స్వాగతం పలికారు. తర్వాత ఎయిర్‌ హోస్టెస్‌ ఆయనకు ఫుడ్‌ ట్రేతో పాటు.. ఒక గ్రీటింగ్‌ కార్డును కూడా అందించింది. ప్రస్తుతం ఈ వీడియో నెట్టింట వైరల్ అవుతోంది.

మరోవైపు దీనితో పాటు.. మరోవీడియోను ఇండిగో షేర్ చేసింది. సోదర, సోదరీమణులకు ప్రత్యేకమైన పండగంటే రాఖీనే అని చెప్పిన ఇండిగో విమాన సంస్థ.. కానీ బిజీ ప్రపంచంలో ఉద్యోగాల వల్ల దూరంగా ఉన్న ఎంతో మంది తోబుట్టువులు ఈ రాఖీ పండగను జరుపుకోలేకపోతున్నారని చెప్పింది. కానీ ఇక్కడ ఒక అక్క, తమ్ముడు రాఖీ పండగను విమానంలోనే జరుపుకునే అవకాశం లభించిందని చెప్పుకొచ్చింది. దీనికి సంబంధించిన వీడియోను ఇండిగో తమ ఎక్స్‌ అకౌంట్లో షేర్‌ చేసింది. ఎంతో ఎత్తులో ఉన్న తోబుట్టవులకు ఈ రోజు ప్రత్యేకమని రాసుకొచ్చింది.

ఇండిగో పోస్ట్ చేసిన ఈ వీడియోలో.. విమానం టేకాఫ్‌ అయ్యే ముందు ఇండిగో సిబ్బంది వారి ప్రయాణీకులకు స్పెషల్ అనౌన్స్‌మెంట్‌ చేసింది. ఉద్యోగ రీత్యా దూరంగా ఉండటం వల్ల.. తాము కొన్ని పండగలు జరుపుకోలేకపోయామని.. కానీ ఈ రోజు తనకు, తన సోదరుడికి ప్రత్యేకమైన రోజని చెప్పింది. చాలా ఏళ్ల తర్వాత కలిసి రక్షాబంధన్ ను ఇలా‌ జరుపుకుంటున్నామంటూ తన సోదరుడు కెప్టెన్‌ గౌరవ్‌కు రాఖీ కట్టింది. ప్రస్తుతం ఇండిగోకు చెందిన ఈ రెండు వీడియోలు నెట్టింట వైరల్ గా మారాయి.

మ్యాంగో న్యూస్ లింక్స్:

టెలీగ్రామ్ : https://t.me/mangonewsofficial

గూగుల్ ప్లే స్టోర్ : https://bit.ly/2R4cbgN

ఆపిల్/ఐఓఎస్ స్టోర్ : https://apple.co/2xE

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

3 × 1 =