లద్దాఖ్ దుర్ఘటన మాటలకు అందని విషాదం, అమరులైన జవాన్లకు వందనాలు: పవన్ కళ్యాణ్

Janasena Chief Pawan Kalyan Says Ladakh Mishap is a Tragedy Beyond Words, Janasena Party Chief Pawan Kalyan Says Ladakh Mishap is a Tragedy Beyond Words, Janasena Party President Pawan Kalyan Says Ladakh Mishap is a Tragedy Beyond Words, Pawan Kalyan Says Ladakh Mishap is a Tragedy Beyond Words, Ladakh Mishap is a Tragedy Beyond Words, Janasena Party Chief Pawan Kalyan, Janasena Party President Pawan Kalyan, India 7 Army Soldiers Demise in Ladakh Road Mishap Grievous Injuries To Others, India 7 Army Soldiers Demise in Ladakh Road Mishap, Grievous Injuries To Others, India 7 Army Soldiers Demise, 7 Army Soldiers Demise, Ladakh Road Mishap, A devastating accident in the Turtuk sector claimed the lives of seven soldiers and left 19 others grievously injured, 19 others grievously injured, A devastating accident in the Turtuk sector, Seven Army personnel killed, Ladakh Road Mishap News, Ladakh Road Mishap Latest News, Ladakh Road Mishap Latest Updates, Ladakh Road Mishap Live Updates, Mango News, Mango News Telugu,

లద్దాఖ్ లోని టుర్టుక్ సెక్టార్‌లో శుక్రవారం ఉదయం భారత సైనికులు ప్రయాణిస్తున్న వాహనం ప్రమాదవశాత్తు ఘాట్ రోడ్డుపై నుంచి షియోక్ నదిలో జారిపడిన ఘటనలో ఏడుగు సైనికులు ప్రాణాలు కోల్పోగా, 19 మంది తీవ్రంగా గాయపడ్డారు. హిమ పర్వతాలు, అత్యంత సంక్లిష్ట వాతావరణంతో నిండివుండే లద్దాఖ్ లో జరిగిన రోడ్డు ప్రమాదంలో ఏడుగురు సైనికులు మృతి చెందిన దుస్సంఘటన తన మనసును తీవ్రంగా కలచివేసిందని జనసేన అధినేత పవన్ కళ్యాణ్ అన్నారు. మరో 19 మంది సైనికులు తీవ్రంగా గాయపడడం మన దురదృష్టంగా భావిస్తున్నానని అన్నారు. ఈ మేరకు పవన్ కళ్యాణ్ ఒక ప్రకటన విడుదల చేశారు.

“మానవ ప్రాణాలు ఎంతో విలువయినవి. అందులోను సైనికుల ప్రాణాలు మరెంతో అపురూపమైనవి. దేశం కోసం తమ సర్వసౌఖ్యాలు విడనాడి, అత్యంత కఠినమైన పరిస్థితుల మధ్య దేశాన్ని కంటికి రెప్పలా కాపాడే సైనికుల త్యాగాలకు ఏమి తిరిగిచ్చి రుణం తీర్చుకోగలం?, అటువంటి జవాన్లు దేశ రక్షణ కర్తవ్యంలో భాగంగా తమ శిబిరం నుంచి వాహనంలో ప్రయాణిస్తూ మార్గమధ్యలో వాహనం నదిలోకి జారిపడి ప్రాణాలు కోల్పోవడం మాటలకు అందని విషాదం. అమరులైన వీరులకు గౌరవ వందనం అర్పిస్తున్నాను. వారి ఆత్మకు శాంతి చేకూరాలని, గాయపడిన వారు త్వరగా కోలుకోవాలని ఆ భగవంతుడ్ని ప్రార్ధిస్తున్నాను. అమరవీరుల కుటుంబాలకు నా ప్రగాఢ సానుభూతి తెలుపుతున్నాను. అమరుల కుటుంబాలను కేంద్ర ప్రభుత్వంతో పాటు, వారి స్వరాష్ట్ర ప్రభుత్వాలు కూడా లెక్కలు వేయకుండా ఉదారంగా ఆర్ధిక సహాయం అందించాలని విజ్ఞప్తి చేస్తున్నాను. అమరుల కుటుంబాలకు ఏ లోటు రాకుండా చూసుకోవలసిన బాధ్యత ప్రభుత్వాలతో పాటు భారతీయులందరిపై ఉందని మనవి చేస్తున్నాను” అని పవన్ కళ్యాణ్ పేర్కొన్నారు.

మ్యాంగో న్యూస్ లింక్స్:

టెలీగ్రామ్ : https://t.me/mangonewsofficial

గూగుల్ ప్లే స్టోర్ : https://bit.ly/2R4cbgN

ఆపిల్/ఐఓఎస్ స్టోర్ : https://apple.co/2xEYF

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

eighteen + 7 =