అమెరికా 46వ అధ్యక్షుడిగా జో బైడెన్, ‌ఉత్కంఠ పోరులో అధ్యక్ష పీఠం కైవసం

46th President of US, Biden victory speech, Elect Joe Biden, Joe Biden, Joe Biden Elected as 46th President of US, Joe Biden Elected as President of US, US election 2020, US election 2020 results, US Election Results, US President, US President Elect Joe Biden, US President Elect Joe Biden Speech, US President Elect Joe Biden Victory

అమెరికాలో అధ్యక్ష ఎన్నికల ఫలితంపై గత 5 రోజులుగా కొనసాగుతున్న ఉత్కంఠ ఎట్టకేలకు వీడింది. అధ్యక్ష పీఠం కోసం 270 ఎలక్టోరల్‌ ఓట్లు సాధించాల్సి ఉండగా, డెమోక్రటిక్ పార్టీ అభ్యర్థి జో బైడెన్ 284 ఎలక్టోరల్ ఓట్లు సాధించారు. దీంతో 46వ అమెరికా అధ్యక్షుడిగా జో బైడెన్ ఎన్నికయ్యారు. పెన్సెల్వేనియా రాష్ట్రంలో తుది ఫలితం ప్రకటించడంతో 20 ఎలక్టోరల్ ఓట్లు సాధించి మొత్తం 284 ఓట్లతో జో బైడెన్ అమెరికా నూతన అధ్యక్షుడుగా ఎన్నికైనట్టు అక్కడి పలు వార్త సంస్థలు అధికారికంగా ప్రకటించాయి. అలాగే అమెరికా ఉపాధ్యక్ష పదవికి ఎన్నికైన తోలి మహిళగా భారత సంతతికి చెందిన కమలా హారిస్ సరికొత్త చరిత్ర సృష్టించారు. మరోవైపు ఇప్పటివరకు వెలువడిన ఫలితాల్లో డోనాల్డ్ ట్రంప్ కేవలం‌ 214 ఎలక్టోరల్ ఓట్లు మాత్రమే దక్కించుకోగలిగారు. తాజా పలితాలతో అమెరికా అధ్యక్షుడిగా జో బైడెన్, ఉపాధ్యక్షురాలిగా కమలా హారిస్ త్వరలో ప్రమాణ స్వీకారం చేయనున్నారు.

మ్యాంగో న్యూస్ యాప్ లింక్స్:

గూగుల్ ప్లే స్టోర్ : https://bit.ly/2R4cbgN

ఆపిల్/ఐఓఎస్ స్టోర్ : https://apple.co/2xEYFJ

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

four × 5 =