కేరళలో కరోనా విజృంభణ: కొత్తగా 32097 పాజిటివ్ కేసులు, 188 మరణాలు

Corona Positive Cases in Kerala, Kerala, Kerala Corona, Kerala Corona Cases, Kerala Corona Deaths, Kerala Corona Positive Cases, Kerala Coronavirus, Kerala Coronavirus Positive Cases, Kerala Coronavirus Updates, Kerala Covid-19, Kerala New Covid Cases, Kerala Reports 32097 New Covid Cases and 188 Deaths, Kerala Reports 32097 New Covid Cases and 188 Deaths in Last 24 Hours, Mango News

కేరళ రాష్ట్రంలో కరోనా మహమ్మారి విజృంభణ కొనసాగుతుంది. ఈ నేపథ్యంలో గత 24 గంటల్లో 1,74,307 శాంపిల్స్ కు పరీక్షలు నిర్వహించగా 32,097 మందికి కరోనా పాజిటివ్ గా నిర్ధారణ అయినట్టు తెలిపారు. రోజువారీ కరోనా పాజిటివిటీ రేటు 18.41 శాతంగా నమోదైంది. దీంతో సెప్టెంబర్ 2, గురువారం మధ్యాహ్నం 2 గంటల నాటికి మొత్తం కేసుల సంఖ్య 41,22,133 కి చేరింది.

అలాగే కరోనాకు చికిత్స పొందుతూ మరో 188 మంది మరణించడంతో మొత్తం మరణాల సంఖ్య 21,149 కు పెరిగింది. ఇక కొత్తగా 21,634 మంది కరోనా నుంచి కోలుకోవడంతో ఇప్పటివరకు కోలుకున్న వారి సంఖ్య 38,60,248 కు చేరింది. దేశంలో ప్రస్తుతం కేరళలోనే అత్యధికంగా 2,40,186 యాక్టీవ్ కేసులు ఉన్నాయి. మరోవైపు కేరళలో ఇప్పటివరకు 3,19,01,842 కరోనా పరీక్షలు నిర్వహించారు.

మ్యాంగో న్యూస్ లింక్స్:

టెలీగ్రామ్ : https://t.me/mangonewsofficial

గూగుల్ ప్లే స్టోర్ : https://bit.ly/2R4cbgN

ఆపిల్/ఐఓఎస్ స్టోర్ : https://apple.co/2xEYFJ

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

6 + nine =