కేరళలో కరోనా : కొత్తగా 12616 పాజిటివ్ కేసులు, 134 మరణాలు

Kerala Reports 12616 New Covid Cases and 134 Deaths in Last 24 Hours

కేరళ రాష్ట్రంలో కరోనా మహమ్మారి తీవ్రత కొనసాగుతుంది. దేశంలోనే అత్యధిక యాక్టీవ్ కేసులు ఉండడంతో పాటుగా దేశవ్యాప్తంగా నమోదయ్యే రోజువారీ మొత్తం కరోనా కేసుల్లో సగానికిపైగా కేరళ రాష్ట్రంలోనే నమోదవుతున్నాయి. ఈ నేపథ్యంలో గత 24 గంటల్లో 98,782 శాంపిల్స్ కు కరోనా పరీక్షలు నిర్వహించగా 12,616 మందికి కరోనా పాజిటివ్ గా నిర్ధారణ అయింది. రోజువారీ కరోనా పాజిటివిటీ రేటు 12.77 శాతంగా నమోదైంది.

అలాగే మొత్తం పాజిటివ్ కేసుల సంఖ్య 47,51,407 కు చేరుకుంది. ఇక కరోనాకు చికిత్స పొందుతూ మరో 134 మంది మరణించడంతో మొత్తం కరోనా మరణాల సంఖ్య 25,811 కి పెరిగింది. కొత్తగా కరోనా నుంచి 14,516 మంది కోలుకోవడంతో ఇప్పటివరకు రికవరీ అయినవారి సంఖ్య 46,02,600 కు చేరుకుంది. కేరళ రాష్ట్రంలో ప్రస్తుతం 1,22,407 యాక్టీవ్ కేసులు ఉన్నాయి.

మ్యాంగో న్యూస్ లింక్స్:

టెలీగ్రామ్ : https://t.me/mangonewsofficial

గూగుల్ ప్లే స్టోర్ : https://bit.ly/2R4cbgN

ఆపిల్/ఐఓఎస్ స్టోర్ : https://apple.co/2xEYFJ

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

7 + 9 =