వైద్య విద్యార్థినికి మంత్రి కేటీఆర్ ఆర్థిక సాయం, ఎంబీబీఎస్ ఫీజుల బాధ్యత తీసుకుంటానని భరోసా

Financial Assistance to Medical Student From Hyderabad, Hyderabad, KTR Extends Financial Assistance to Medical Student, KTR extends financial help to poor student, KTR extends financial support to an MBBS student, KTR provides financial assistance to MBBS Student, Mango News, Minister KTR, Minister KTR Extends Financial Assistance to Medical Student, Minister KTR Extends Financial Assistance to Medical Student From Hyderabad, telangana

తెలంగాణ రాష్ట్ర ఐటీ, పరిశ్రమలు, మున్సిపల్ శాఖ మంత్రి కేటీఆర్ మరోసారి తన మంచి మనసును చాటుకున్నారు. వైద్య విద్యలో ఉత్తమ ప్రతిభ కనబరుస్తూ ఆర్థిక ఇబ్బందులతో మధ్యలోనే చదువు ఆగిపోవడంతో తన తల్లితో కలిసి కూరగాయలు అమ్ముతున్న అనూష పరిస్థితిని తెలుసుకున్న మంత్రి కేటీఆర్, ఆమె వైద్య విద్య కోసం ఆర్థిక సహాయం అందించడానికి ముందుకు వచ్చారు. హైదరాబాద్ నగరంలోని బోరబండకు చెందిన అనూష కిర్గిజిస్తాన్ హెల్త్ యూనివర్సిటీలో ఎంబీబీఎస్ చదువుతూ తొలి 3 ఏళ్లలో 95% కు పైగా మార్కులు సాధించింది.

అయితే కరోనా పరిస్థితుల నేపథ్యంలో ఆమె దేశానికి తిరిగి వచ్చింది. ఈ క్రమంలో తన వైద్య విద్యను కొనసాగించడంలో అనూష ఆర్థిక ఇబ్బందుల గురించి తెలుసుకున్న మంత్రి కేటీఆర్, ఆమెకు అవసరమైన ఆర్ధిక సహాయాన్ని అందజేశారు. ఎంబీబీఎస్ ఫీజుల బాధ్యత తీసుకుంటానని మంత్రి తెలిపారు. ఈ సందర్భంగా తన వైద్య విద్యకు అండగా నిలిచిన మంత్రి కేటీఆర్ కు అనూషతో పాటుగా ఆమె కుటుంబసభ్యులు కృతజ్ఞతలు తెలియజేశారు.

మ్యాంగో న్యూస్ లింక్స్:

టెలీగ్రామ్ : https://t.me/mangonewsofficial

గూగుల్ ప్లే స్టోర్ : https://bit.ly/2R4cbgN

ఆపిల్/ఐఓఎస్ స్టోర్ : https://apple.co/2xEYFJ

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

3 × two =