కేరళలో కొత్తగా 22524 కరోనా పాజిటివ్ కేసులు, 14 మరణాలు నమోదు

Kerala Reports 22524 New Covid-19 Cases and 14 Deaths Reported in Last 24 Hours,Kerala Corona, Kerala Corona Cases, Kerala Corona Deaths, Kerala Corona Positive Cases, Kerala Corona Positive Cases Update, Kerala Coronavirus, Kerala Coronavirus Cases, Kerala Coronavirus News, Kerala Coronavirus Positive Cases, Kerala Coronavirus Updates, Kerala Covid-19, Kerala Covid-19 Cases, Kerala Covid-19 New Positive Cases, Kerala Covid-19 Updates, Kerala State Corona Positive Cases Update, Mango News

కేరళ రాష్ట్రంలో కరోనా మూడో వేవ్ తీవ్రత కొనసాగుతుంది. ఈ నేపథ్యంలో ఇటీవల భారీ సంఖ్యలో కరోనా పాజిటివ్ కేసులు నమోదవుతున్నాయి. గత 24 గంటల్లో 78,682 శాంపిల్స్ కు కరోనా పరీక్షలు నిర్వహించగా 22,524 మందికి కరోనా పాజిటివ్ గా నిర్ధారణ అయింది. దీంతో రోజువారీ కరోనా పాజిటివిటీ రేటు 28.62 శాతంగా నమోదైంది. అలాగే మొత్తం పాజిటివ్ కేసుల సంఖ్య 62,71,383 కు చేరుకుంది. ఇక కొత్తగా కరోనాకు చికిత్స పొందుతూ గత 24 గంటల్లో మరో 14 మంది మరణించినట్టు తెలిపారు.

పత్రాలు ఆలస్యంగా అందినందున గత 24 గంటల్లో మునుపటి రోజులకు సంబంధించిన 113 మరణాలను, అలాగే కేంద్ర ప్రభుత్వ కొత్త మార్గదర్శకాల ప్రకారం 733 మరణాలను ప్రకటించారు. దీంతో కేరళలో మొత్తం కరోనా మరణాల సంఖ్య 59,115 కి పెరిగింది. కొత్తగా కరోనా నుంచి 49,586 మంది కోలుకోవడంతో ఇప్పటివరకు రికవరీ అయినవారి సంఖ్య 59,32,609 కు చేరుకుంది. కేరళ రాష్ట్రంలో ప్రస్తుతం 3,01,424 యాక్టీవ్ కేసులు ఉన్నాయి.

మ్యాంగో న్యూస్ లింక్స్:

టెలీగ్రామ్ : https://t.me/mangonewsofficial

గూగుల్ ప్లే స్టోర్ : https://bit.ly/2R4cbgN

ఆపిల్/ఐఓఎస్ స్టోర్ : https://apple.co/2xEYFJ

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

3 + eight =