కేరళలో కరోనా: కొత్తగా 6111 పాజిటివ్ కేసులు, 51 మరణాలు నమోదు

Kerala Corona, Kerala Corona Cases, Kerala Corona Deaths, Kerala Corona Positive Cases, Kerala Corona Positive Cases Update, Kerala Coronavirus, Kerala Coronavirus Cases, Kerala Coronavirus News, Kerala Coronavirus Positive Cases, Kerala Coronavirus Updates, Kerala Covid-19, Kerala Covid-19 Cases, Kerala Covid-19 New Positive Cases, Kerala Covid-19 Updates, Kerala State Corona Positive Cases Update, Mango News

కేరళ రాష్ట్రంలో కరోనా మహమ్మారి విజృంభణ కొనసాగుతుంది. ఈ నేపథ్యంలో గత 24 గంటల్లో 66,693 శాంపిల్స్ కు పరీక్షలు నిర్వహించగా 6,111 మందికి కరోనా పాజిటివ్ గా నిర్ధారణ అయినట్టు తెలిపారు. రోజువారీ కరోనా పాజిటివిటీ రేటు 9.16 శాతంగా నమోదైంది. దీంతో నవంబర్ 18, గురువారం మధ్యాహ్నం 2 గంటల నాటికి మొత్తం కేసుల సంఖ్య 50,84,095 కి చేరింది.

అలాగే కరోనాకు చికిత్స పొందుతూ మరో 51 మంది మరణించడంతో మొత్తం మరణాల సంఖ్య 36,847 కు పెరిగింది. ఇక కొత్తగా 7,202 మంది కరోనా నుంచి కోలుకోవడంతో ఇప్పటివరకు కోలుకున్న వారి సంఖ్య 49,84,328 కు చేరింది. దేశంలో ప్రస్తుతం కేరళలోనే అత్యధికంగా 62,288 యాక్టీవ్ కేసులు ఉన్నాయి. మరోవైపు కేరళలో ఇప్పటివరకు 3,90,67,192 కరోనా పరీక్షలు నిర్వహించారు.

మ్యాంగో న్యూస్ లింక్స్:

టెలీగ్రామ్ : https://t.me/mangonewsofficial

గూగుల్ ప్లే స్టోర్ : https://bit.ly/2R4cbgN

ఆపిల్/ఐఓఎస్ స్టోర్ : https://apple.co/2xEYFJ

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

two × one =