దాదాపు 1.41 కోట్లతో ఏడు అంబులెన్స్ లు అందుబాటులోకి, ప్రారంభించిన మంత్రి హరీశ్ రావు

7 Ambulance Services at King Koti DME Campus, CM KCR to lay stone for four hospitals in Hyderabad, Harish Rao Launches 7 Ambulance Services, Harish Rao Launches 7 Ambulance Services at King Koti DME Campus, Health Minister Harish Rao, Health Minister Harish Rao Launches 7 Ambulance Services at King Koti DME Campus, King Koti DME Campus, Mango News, Minister Harish Rao Launches 7 Ambulance Services, Telangana Health Minister, Telangana Health Minister Harish Rao

హైదరాబాద్ లోని కోఠి డీఎంఈ క్యాంపస్ లో గురువారం రాష్ట్ర వైద్య ఆరోగ్యశాఖ మంత్రి హరీశ్ రావు అంబులెన్స్ సేవలను ప్రారంభించారు. ఈ సందర్భంగా మంత్రి మాట్లాడుతూ, దాదాపు 1.41 కోట్లతో ఏడు అంబులెన్స్ సేవలు ప్రారంభమవుతున్నాయన్నారు. 4 అంబులెన్స్ లో లైఫ్ సపోర్ట్ కూడా ఉందని, బోధనస్పత్రుల్లో ఈ వాహనాలు వినియోస్తారని చెప్పారు. కరోనా లాంటి పరిస్థితుల్లో అంబులెన్స్ లను ఇవ్వడం సంతోషంమని, హ్యుందాయ్ సంస్థను అభినందిస్తున్నట్టు చెప్పారు. రాష్ట్రంలో మొత్తం 108 వాహనాలు 429 ఉన్నాయని, మరింత మెరుగ్గా 108 సేవలు అందేలా చర్యలు తీసుకుంటామన్నారు.

ఇక పాత వాహనాలు తొలగించి అవసరం అయిన చోట కొత్త వాహనాలు కూడా అందుబాటులోకి తెస్తామని చెప్పారు. మరోవైపు హైదరాబాద్ లో నాలుగు ఆసుపత్రులు సిద్ధం చేస్తున్నామని, త్వరలోనే హైదరబాద్ పరిధిలో ఏర్పాటు చేయనున్న ఆసుపత్రులకు సీఎం కేసీఆర్ శంకుస్థాపన చేయనున్నట్టు తెలిపారు. అలాగే గాంధీ ఆసుపత్రిలో క్యాథ్ ల్యాబ్ సేవలు పునరుద్దరణకు కూడా ఆదేశాలు ఇచ్చినట్టు మంత్రి హరీశ్ రావు పేర్కొన్నారు.

 

మ్యాంగో న్యూస్ లింక్స్:

టెలీగ్రామ్ : https://t.me/mangonewsofficial

గూగుల్ ప్లే స్టోర్ : https://bit.ly/2R4cbgN

ఆపిల్/ఐఓఎస్ స్టోర్ : https://apple.co/2xEYFJ

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

4 × 2 =