పాన్-ఆధార్ లింకింగ్ గడువు జూన్ 30 వరకు పొడిగించిన కేంద్రం

Last Date For Linking Of PAN-Aadhaar Extended To 2023 June 30Th,Last Date For Linking Of PAN-Aadhaar,PAN-Aadhaar Linking Extended,Linking Of PAN-Aadhaar Extended To 2023 June 30Th,Mango News,Mango News Telugu,PAN-Aadhaar Linking Deadline Extended,PAN-Aadhaar Linking Deadline Extended,Aadhaar-PAN Link Last Date Extension 2023,Deadline To Link Aadhaar And PAN Extended,Date For Linking PAN And Aadhaar,Aadhaar PAN Link Last Date,PAN Aadhaar Link Status,PAN Aadhaar Linking Latest News

పాన్-ఆధార్ కార్డు లింకింగ్/అనుసంధానం చేసే విషయంలో కేంద్రప్రభుత్వం మరికొన్ని రోజులు అవకాశం కల్పించింది. పాన్-ఆధార్ లింకింగ్ గడువును 2023, జూన్ 30 వరకు పొడిగించినట్టు కేంద్ర ఆర్థికశాఖ మంగళవారం ఒక ప్రకటన చేసింది. “పన్ను చెల్లింపుదారులకు మరికొంత సమయాన్ని అందించడానికి, పాన్ మరియు ఆధార్‌లను లింక్ చేసే తేదీని 2023, జూన్ 30 వరకు పొడిగించాం, దీని ద్వారా వ్యక్తులు ఎటువంటి పరిణామాలను ఎదుర్కోకుండా ఆధార్-పాన్ లింకింగ్ కోసం నిర్దేశించిన అథారిటీకి తమ ఆధార్‌ను తెలియజేయవచ్చు. ఈ మేరకు ప్రత్యేకంగా నోటిఫికేషన్ విడుదల చేస్తున్నాం” అని తెలిపారు.

ముందుగా ఆదాయపు పన్ను చట్టం1961 నిబంధనల ప్రకారం, 2017 జూలై 1 నాటికి పాన్ కార్డు కేటాయించబడిన మరియు ఆధార్ నంబర్‌ను పొందేందుకు అర్హత ఉన్న ప్రతి వ్యక్తి, తన ఆధార్ ను 2023, మార్చి 31 లోపు నిర్ణీత రుసుము చెల్లించి పాన్ కార్డుకులింక్ చేయాలని కేంద్ర ప్రభుత్వం గడువు విధించింది. అలా చేయడంలో విఫలమైతే చట్టం ప్రకారం 2023, ఏప్రిల్ 1 నుంచి కొన్ని పరిణామాలను ఎదుర్కొవాల్సి ఉంటుందని తెలిపారు. కాగా తాజాగా పాన్ మరియు ఆధార్‌లను లింక్ చేయడం కోసం నిర్ణీత అథారిటీకి ఆధార్‌ను తెలియజేయడానికి తేదీని 2023, జూన్ 30 వరకు పొడిగించబడిందని తెలిపారు.

ప్రకటించిన విధంగా తమ ఆధార్‌ను తెలియజేయడంలో విఫలమైన పన్ను చెల్లింపుదారుల యొక్క పాన్ కార్డు 2023, జూలై 1 నుండి పనిచేయనిదిగా/చెల్లనిదిగా మారుతుందని చెప్పారు. పాన్ కార్డు పని చేయని సమయంలో, అటువంటి పాన్ కార్డులకు రిఫండ్ తిరిగి చెల్లింపు చేయబడదన్నారు. పాన్ పనిచేయని కాలానికి అటువంటి రిఫండ్ పై వడ్డీ చెల్లించబడదని మరియు చట్టంలో అందించిన విధంగా టీడీఎస్ మరియు టీసీఎస్ లు అధిక రేటుతో డిడక్ట్/కలెక్ట్ చేయబడతాయని పేర్కొన్నారు. అయితే రూ.1,000 రుసుము చెల్లించిన తర్వాత నిర్ణీత అథారిటీకి ఆధార్‌ను తెలియజేసినప్పుడు, పాన్ 30 రోజుల్లో మళ్లీ ఆపరేటివ్‌గా చేసుకోవచ్చన్నారు

మరోవైపు పాన్-ఆధార్ లింకింగ్ నుండి మినహాయింపు పొందిన వ్యక్తులు ఈ పరిణామాలకు సంబంధం ఉండదన్నారు. ఈ కేటగిరీలో స్పెసిఫైడ్ రాష్ట్రాలలో నివసిస్తున్నవారు, చట్టం ప్రకారం నాన్-రెసిడెంట్, భారతదేశ పౌరుడు కాని వ్యక్తి లేదా మునుపటి సంవత్సరంలో ఎప్పుడైనా ఎనభై సంవత్సరాలు లేదా అంతకంటే ఎక్కువ వయస్సు ఉన్న వ్యక్తులు ఉన్నారు. కాగా ఇప్పటి వరకు 51 కోట్లకు పైగా పాన్‌ కార్డులను ఆధార్‌తో అనుసంధానం చేసినట్లు కేంద్ర ఆర్ధిక శాఖ పేర్కొంది.

మ్యాంగో న్యూస్ లింక్స్: 

టెలీగ్రామ్ : https://t.me/mangonewsofficial

గూగుల్ ప్లే స్టోర్ : https://bit.ly/2R4cbgN

ఆపిల్/ఐఓఎస్ స్టోర్ : https://apple.co/2xE

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

2 × three =