సీఎం జగన్ ను కలిసిన అగస్టే టానో కోమ్ నేతృత్వంలోని ప్రపంచ బ్యాంక్ ప్రతినిధుల బృందం

Delegation of World Bank led by Auguste Tano Kouame Called on CM YS Jagan at Camp Office,Delegation of World Bank,Auguste Tano Kouame Called on CM YS Jagan,World Bank led by Auguste Tano Kouame,Mango News,Mango News Telugu,World Bank team praises Andhra Pradesh development,World Bank Team Meets CM Jagan Mohan Reddy,World Bank team calls on AP CM,World Bank India Director Lauds AP CM YS Jagan,WB heaps praise on AP's Welfare Schemes,AP CM YS Jagan Mohan Reddy,Andhra Pradesh Latest Investments,Auguste Tano Kouame News Today

భారత్ లో ప్రపంచ బ్యాంక్ డైరెక్టర్ అగస్టే టానో కోమ్ నేతృత్వంలోని ప్రపంచబ్యాంక్ ప్రతినిధుల బృందం సోమవారం సీఎం క్యాంప్ కార్యాలయంలో ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి వైఎస్ జగన్ మోహన్ రెడ్డిని కలిసింది. ఈ సందర్భంగా పబ్లిక్ హెల్త్ సెక్టార్‌ను బలోపేతం చేయడం, సపోర్టింగ్ ఆంధ్రాస్ లెర్నింగ్ ట్రాస్ఫార్మేషన్ (సాల్ట్), ఏపీ ఇరిగేషన్ ట్రాన్స్‌ఫర్మేషన్ ప్రాజెక్ట్‌తో సహా మూడు ప్రపంచ బ్యాంకు నిధులతో కూడిన ప్రాజెక్టులను సమీక్షించారు. పాలనలో ఉత్తమ విద్య మరియు ఉత్తమ వైద్య విధానాలను పాటిస్తున్నందుకు సీఎం వైఎస్ జగన్‌ను అగస్టే టానో కోమ్ అభినందించారు. ప్రపంచ బ్యాంకు 22 రాష్ట్రాలకు నిధులు సమకూరుస్తోందని, ఏపీని ఆదర్శంగా తీసుకోవచ్చని, రాష్ట్ర అభివృద్ధికి అన్ని రకాల సహకారం, తోడ్పాటు అందిస్తామని అగస్టే టానో కోమ్ హామీ ఇచ్చారు.

ఈ సందర్భంగా విద్య, ఆరోగ్యం, వ్యవసాయ రంగాల్లో విప్లవాత్మక మార్పులను సీఎం వైఎస్ జగన్ వివరించి, వాటిపై సమగ్ర అధ్యయనం చేయాలని ప్రపంచ బ్యాంక్ ప్రతినిధి బృందాన్ని కోరారు. అలాగే ఆర్థికంగా మాత్రమే కాకుండా, ఉత్తమ పద్ధతులు మరియు సాంకేతిక పరిజ్ఞానాన్ని ఉపయోగించడంలో వారి మద్దతును కోరారు. ఆధునిక బోధనా పద్ధతులతో పాటు పలు సంస్కరణలు, పథకాలతో డిజిటలైజేషన్ దిశగా అడుగులు వేస్తున్నామని, వ్యవసాయ, పారిశ్రామిక, వైద్య రంగాలను బలోపేతం చేస్తున్నామన్నారు. నైపుణ్యం ఉన్న మానవ వనరులను సిద్ధంచేస్తూ పారిశ్రామిక ప్రగతికి బాటలు వేస్తున్నామని సీఎం వైఎస్ జగన్ తెలిపారు.

 

మ్యాంగో న్యూస్ లింక్స్: 

టెలీగ్రామ్ : https://t.me/mangonewsofficial

గూగుల్ ప్లే స్టోర్ : https://bit.ly/2R4cbgN

ఆపిల్/ఐఓఎస్ స్టోర్ : https://apple.co/2xE

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here