ఒకేరోజులో 12,134 కరోనా కేసులు, 302 మరణాలు నమోదు

Maharashtra Covid-19 Updates: 12134 New Positive Cases and 302 Deaths Reported on October 9

మహారాష్ట్రలో కరోనా వైరస్ తీవ్రత కొనసాగుతుంది. ఆ రాష్ట్రంలో పాజిటివ్ కేసుల సంఖ్య 15 లక్షలు దాటింది. ఈ క్రమంలో అక్టోబర్ 9, శుక్రవారం నాడు ఒక్కరోజే 12,134 కరోనా పాజిటివ్ కేసులు, 302 కరోనా మరణాలు నమోదయ్యాయి. దీంతో ఆ రాష్ట్రంలో మొత్తం కేసుల సంఖ్య 15,06,018 కి చేరగా, మరణాల సంఖ్య 39,732 కు పెరిగింది. మరోవైపు మహారాష్ట్రలో ఇప్పటికి 74,87,383 కరోనా పరీక్షలు నిర్వహించారు.

మహారాష్ట్రలో కరోనా కేసుల వివరాలు (అక్టోబర్ 9, బుధవారం నాటికీ):

  • రాష్ట్రంలో నమోదైన మొత్తం పాజిటివ్ కేసుల సంఖ్య – 15,06,018
  • డిశ్చార్జ్ అయినవారి సంఖ్య – 12,29,339
  • యాక్టీవ్ కేసులు – 2,36,491
  • అక్టోబర్ 9 న నమోదైన కేసులు – 12,134
  • అక్టోబర్ 9 న డిశ్చార్జ్ అయినవారు – 17,323
  • అక్టోబర్ 9 న నమోదైన మరణాల సంఖ్య – 302
  • మొత్తం మరణాల సంఖ్య – 39,732

మ్యాంగో న్యూస్ యాప్ లింక్స్:

గూగుల్ ప్లే స్టోర్ : https://bit.ly/2R4cbgN

ఆపిల్/ఐఓఎస్ స్టోర్ : https://apple.co/2xEYFJu

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

five × five =