మహారాష్ట్రలో 24 గంటల్లో 8129 కరోనా కేసులు, 200 మరణాలు నమోదు

Corona Positive Cases in Maharashtra, Corona Positive Cases In Maharashtra, Maharashtra, Maharashtra , Maharashtra Corona, Maharashtra Corona Cases, Maharashtra Corona Deaths, Maharashtra Corona Positive Cases, Maharashtra Coronavirus, Maharashtra Coronavirus Positive Cases, Maharashtra Coronavirus Updates, Maharashtra COVID 19,mango news

మహారాష్ట్రలో కరోనా మహమ్మారి తీవ్రత తగ్గుముఖం పట్టింది. గతకొన్ని రోజులుగా కొత్త కరోనా కేసులు, మరణాలు సంఖ్యలో తగ్గుదల కొనసాగుతుంది. ఈ క్రమంలో జూన్ 14, సోమవారం కూడా 8,129 కరోనా కేసులు, 200 మరణాలు నమోదయ్యాయి. దీంతో మొత్తం పాజిటివ్ కేసుల సంఖ్య 59,17,121 కి చేరగా, కరోనాతో మరణించిన వారి సంఖ్య 1,12,696 కి పెరిగింది. ఇక కొత్తగా కరోనా నుంచి 14,732 మంది కోలుకోవడంతో ఇప్పటివరకు రికవరీ అయినవారి సంఖ్య 56,54,003 కు చేరుకుంది. రాష్ట్రంలో కరోనా రికవరీ రేటు 95.55 శాతంగా ఉండగా, మరణాల రేటు 1.90 శాతంగా నమోదైంది. ప్రస్తుతం 1,47,354 యాక్టీవ్ కేసులు ఉన్నాయి. మరోవైపు సోమవారం నాటికి మహారాష్ట్రలో 3,82,15,492 కరోనా పరీక్షలు నిర్వహించారు.

మ్యాంగో న్యూస్ లింక్స్:

టెలీగ్రామ్ : https://t.me/mangonewsofficial

గూగుల్ ప్లే స్టోర్ : https://bit.ly/2R4cbgN

ఆపిల్/ఐఓఎస్ స్టోర్ : https://apple.co/2xEYFJ

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here