తెలంగాణలో జూలై 1 నుంచి ఇంటర్‌ సెకండ్ ఇయర్ విద్యార్థులకు ఆన్‌లైన్‌ క్లాసులు

Mango News, Online Classes For Telangana Inter Second Year Students, Online Classes For Telangana Inter Second Year Students Will Start, Online Classes For Telangana Inter Second Year Students Will Start From July 1st, Online Digital Classes to College Students 2021, Telangana Inter second year classes, Telangana Inter second year classes to begin, Telangana Inter second year online classes, Telangana Inter Second Year Students, TS 12th Class Online Video Classes, TS Inter Online Classes Timings

తెలంగాణ రాష్ట్రంలోని ప్రభుత్వ జూనియర్‌ కాలేజీల్లో ఇంటర్మీడియట్ ద్వితీయ సంవత్సరం విద్యార్థులకు జూలై 1వ నుంచి ఆన్‌లైన్‌ క్లాసులు ప్రారంభం కానున్నాయి. ఇంటర్ ద్వితీయ సంవత్సర విద్యార్థులకు ఆన్‌లైన్‌ క్లాసుల నిర్వహణపై రాష్ట్ర విద్యాశాఖ మంత్రి సబితా ఇంద్రారెడ్డి ఆదేశాలిచినట్టు రాష్ట్ర ఇంటర్ బోర్డు కార్యదర్శి సయ్యద్‌ ఉమర్‌ జలీల్‌ తెలిపారు. జూన్ 16 నుంచి కాలేజీలలో ఏర్పాట్లు పూర్తిచేసి, జూలై 1 నుంచి ద్వితీయ సంవత్సరం విద్యార్థులకు ఆన్‌లైన్‌ క్లాసులు ప్రారంభిస్తామని వెల్లడించారు.

మరోవైపు ఇంటర్ ప్రథమ సంవత్సరంలోకి మొదటివిడత ప్రవేశాలు జూలై 5వ తేదీ వరకు జరుగుతాయని చెప్పారు. ఈ క్రమంలోనే రెండు, మూడు విడతల ప్రవేశ పక్రియ జరిపి, వారికీ కూడా దూరదర్శన్‌, టీశాట్‌ ద్వారా ఆన్‌లైన్‌ క్లాసులను ప్రసారం చేయనున్నట్టు తెలిపారు. గత సంవత్సరం లాగానే 2021-22 విద్యాసంవత్సరానికి కూడా 70 శాతం సిలబస్‌ నుంచే ఆన్‌లైన్‌ క్లాసులు జరగనున్నాయని చెప్పారు. ఇక టీవీలు, స్మార్ట్‌ఫోన్లు/మొబైల్ ఫోన్లు లేని విద్యార్థులకు కాలేజీల్లో క్లాసులు వినేందుకు డిజిటల్‌ లైబ్రరీలు ఏర్పాటు చేయాలని ఇంటర్‌ బోర్డు నిర్ణయించినట్టుగా తెలుస్తుంది.

మ్యాంగో న్యూస్ లింక్స్:

టెలీగ్రామ్ : https://t.me/mangonewsofficial

గూగుల్ ప్లే స్టోర్ : https://bit.ly/2R4cbgN

ఆపిల్/ఐఓఎస్ స్టోర్ : https://apple.co/2xEYFJ

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here