మహారాష్ట్రలో 24 గంటల్లో 224 కరోనా మరణాలు, మరో 6269 పాజిటివ్ కేసులు నమోదు

Corona Positive Cases in Maharashtra, Corona Positive Cases In Maharashtra, Maharashtra, Maharashtra , Maharashtra Corona, Maharashtra Corona Cases, Maharashtra Corona Deaths, Maharashtra Corona Positive Cases, Maharashtra Coronavirus, Maharashtra Coronavirus Positive Cases, Maharashtra Coronavirus Updates, Maharashtra COVID 19,mango news

మహారాష్ట్ర రాష్ట్రంలో కరోనా మహమ్మారి వ్యాప్తి కొంత తగ్గుముఖం పట్టింది. గతకొన్ని రోజులుగా రోజువారీ కరోనా కేసులు పదివేలు లోపుగానే నమోదవుతున్నాయి. ఈ క్రమంలో జూలై 24, శనివారం నాడు 6,269 కరోనా కేసులు, 224 మరణాలు నమోదయ్యాయి. దీంతో మొత్తం పాజిటివ్ కేసుల సంఖ్య 62,58,079 కి చేరగా, కరోనాతో మరణించిన వారి సంఖ్య 1,31,429 కి పెరిగింది. ఇక కొత్తగా కరోనా నుంచి 7,332 మంది కోలుకోవడంతో ఇప్పటివరకు రికవరీ అయినవారి సంఖ్య 60,29,817 కు చేరుకుంది. రాష్ట్రంలో కరోనా రికవరీ రేటు 96.35 శాతంగా ఉండగా, మరణాల రేటు 2.1 శాతంగా నమోదైంది. ప్రస్తుతం 93,479 యాక్టీవ్ కేసులు ఉన్నాయి. మరోవైపు శనివారం నాటికి మహారాష్ట్రలో 4,66,44,448 కరోనా పరీక్షలు నిర్వహించారు.

మ్యాంగో న్యూస్ లింక్స్:

టెలీగ్రామ్ : https://t.me/mangonewsofficial

గూగుల్ ప్లే స్టోర్ : https://bit.ly/2R4cbgN

ఆపిల్/ఐఓఎస్ స్టోర్ : https://apple.co/2xEYFJ

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

15 − eleven =