దళితబంధు పథకం కోసం దశలవారీగా లక్ష కోట్ల వరకు ఖర్చుకు ప్రభుత్వం సిద్ధం: సీఎం కేసీఆర్

Buddhist Dharma Chakra Day, CM KCR Says Govt Ready to Spend One Lakh Crore on Dalit Bandhu Scheme, CM KCR Says Govt Ready to Spend One Lakh Crore on Dalit Bandhu Scheme in a Phased Manner, Dalit Bandhu scheme, Dalit Bandhu Scheme in a Phased Manner, Govt Ready to Spend Rs 1 Lakh Crore for Welfare of Dalits, Mango News, Ready to spend Rs 1 lakh crore on Dalit Bandhu, Ready to spend Rs 80000 crore on Dalitha Bandhu, Telangana Dalit Bandhu scheme, Telangana Dalit Bandhu scheme for Dalit empowerment

తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా చేపట్టబోతున్న తెలంగాణ దళిత బంధు పథకంపై ముఖ్యమంత్రి కె.చంద్రశేఖర్ రావు మరో కీలక ప్రకటన చేశారు. కాళ్లు, రెక్కలు మాత్రమే ఆస్తులుగా కలిగిన దళిత కుటుంబాలే మొదటి ప్రాధాన్యతగా ‘దళిత బంధు పథకం’ రాష్ట్రవ్యాప్తంగా అమలు జరుగుతుందని, అర్హులైన దళితులందరికీ దళిత బంధు పథకం అమలు చేస్తామని, దశలవారీగా అమలు చేసే ఈ పథకం కోసం రూ.80 వేల కోట్ల నుంచి రూ.1 లక్ష కోట్ల వరకు ఖర్చు చేయడానికి ప్రభుత్వం సిద్ధంగా ఉందని సీఎం కేసీఆర్ స్పష్టం చేశారు.

దళిత బంధు కేవలం తెలంగాణలోనే కాకుండా యావత్ దేశానికి ఆదర్శంగా నిలవనుంది:

ఎస్సీ కార్పోరేషన్ చైర్మన్ గా బండా శ్రీనివాస్ ను నియమించిన నేపథ్యంలో సీఎంకు ధన్యవాదాలు తెలిపేందుకు హుజూరాబాద్ నియోజకవర్గ పరిధిలోని దళిత సంఘాల నేతలు, ప్రజాప్రతినిధులు, మేధావులు, కార్యకర్తలు ప్రగతిభవన్ కు తరలివచ్చారు. ఈ సందర్భంగా సీఎం కేసీఆర్ వారిని ఉద్దేశించి సమావేశంలో మాట్లాడారు. హుజూరాబాద్ లో పైలట్ ప్రాజెక్టుగా ప్రారంభమయ్యే దళిత బంధు కేవలం తెలంగాణలో మాత్రమే కాకుండా యావత్ దేశానికి ఆదర్శంగా నిలిచి, దేశ దళితులందరినీ ఆర్థిక, సామాజిక వివక్షల నుంచి విముక్తులను చేయబోతున్నదని తెలిపారు. అందుకు పట్టుదలతో అందరం కలిసి ఈ పథకం విజయవంతం అయ్యేందుకు కృషి చేద్దామని, దళిత ప్రజాప్రతినిధులకు, మేధావులకు, సంఘాల నేతలకు సీఎం కేసీఆర్ పిలుపునిచ్చారు.

 

మ్యాంగో న్యూస్ లింక్స్:

టెలీగ్రామ్ : https://t.me/mangonewsofficial

గూగుల్ ప్లే స్టోర్ : https://bit.ly/2R4cbgN

ఆపిల్/ఐఓఎస్ స్టోర్ : https://apple.co/2xEYFJ

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

nine + fourteen =