మహారాష్ట్రలో కరోనా: ఒకేరోజులో 67013 కరోనా పాజిటివ్ కేసులు, 568 మరణాలు

Corona Positive Cases in Maharashtra, Corona Positive Cases In Maharashtra, Maharashtra, Maharashtra , Maharashtra Corona, Maharashtra Corona Cases, Maharashtra Corona Deaths, Maharashtra Corona Positive Cases, Maharashtra Coronavirus, Maharashtra Coronavirus Positive Cases, Maharashtra Coronavirus Updates, Maharashtra COVID 19,mango news

మహారాష్ట్రలో కరోనా మహమ్మారి తీవ్రత కొనసాగుతుంది. ఇటీవల ప్రతి రోజూ 60 వేలకుపైగానే కరోనా పాజిటివ్ కేసులు నమోదవుతున్నాయి. మహారాష్ట్ర ప్రభుత్వం ఇప్పటికే లాక్ డౌన్ తరహా ఆంక్షలను రాష్ట్రవ్యాప్తంగా అమలు చేస్తుంది. ప్రస్తుతం దేశంలో ఉన్న యాక్టీవ్ కరోనా కేసుల్లో 30 శాతానికిపైగా మహారాష్ట్రలోనే ఉన్నాయి. ఈ నేపథ్యంలో ఏప్రిల్ 22, గురువారం కూడా 67013 కరోనా కేసులు, 568 మరణాలు నమోదయ్యాయి.

దీంతో మొత్తం పాజిటివ్ కేసుల సంఖ్య 40,94,840 కి చేరగా, కరోనాతో మరణించిన వారి సంఖ్య 62,479 కి పెరిగింది. ఇక కొత్తగా కరోనా నుంచి 62,298 మంది కోలుకోవడంతో ఇప్పటివరకు రికవరీ అయినవారి సంఖ్య 33,30,747 కు చేరుకుంది. రాష్ట్రంలో కరోనా రికవరీ రేటు 81.34 శాతంగా ఉండగా, మరణాల రేటు 1.53 శాతంగా నమోదైంది. ప్రస్తుతం 6,99,858 యాక్టీవ్ కేసులు ఉన్నాయి. మరోవైపు గురువారం నాటికి మహారాష్ట్రలో 2,48,95,986 కరోనా పరీక్షలు నిర్వహించారు.

మ్యాంగో న్యూస్ లింక్స్:

టెలీగ్రామ్ : https://t.me/mangonewsofficial

గూగుల్ ప్లే స్టోర్ : https://bit.ly/2R4cbgN

ఆపిల్/ఐఓఎస్ స్టోర్ : https://apple.co/2xEYFJ

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

one × one =