పీడీఆర్డీ గ్రాంట్ కింద 14 రాష్ట్రాలకు రూ.7,183.42 కోట్లు విడుదల చేసిన కేంద్రం, ఏపీకి రూ.879.08 కోట్లు

Ministry of Finance Released 2nd Monthly Instalment of PDRD Grant of Rs 7183.42 Cr to 14 States, 2nd monthly installment of the Post Devolution Revenue Deficit grant to states, central government on Friday released Rs 7183.42 crore as revenue deficit grant to 14 states, PDRD Grant of Rs 7183.42 Cr to 14 States, revenue deficit grant to 14 states, central government, Ministry of Finance, PDRD Grant, Post Devolution Revenue Deficit grant, Post Devolution Revenue Deficit grant News, Post Devolution Revenue Deficit grant Latest News, Post Devolution Revenue Deficit grant Latest Updates, Post Devolution Revenue Deficit grant Live Updates, Ministry of Finance Released PDRD 2nd Monthly Instalment, 14 states, Andhra Pradesh, West Bengal, Rajasthan, Punjab, Assam, Kerala, Mango News, Mango News Telugu,

కేంద్ర ఆర్థిక శాఖ దేశంలోని 14 రాష్ట్రాలకు శుక్రవారం రూ.7,183.42 కోట్లు విడుదల చేసింది. 15వ ఆర్థిక సంఘం సిఫార్సుల మేరకు పోస్ట్ డెవల్యూషన్ రెవెన్యూ డెఫిసిట్ గ్రాంట్ కింద ఈ ఆర్ధిక సంవత్సరంలో రెండో విడతగా 14 రాష్ట్రాలకు 7,183.42 కోట్లు విడుదల చేసినట్టు కేంద్ర ఆర్థిక శాఖ తెలిపింది. 15వ ఆర్థిక సంఘం పీడీఆర్డీ గ్రాంట్ కింద 2022-23 ఆర్థిక సంవత్సరానికి గానూ 14 రాష్ట్రాలకు మొత్తం 86,201 కోట్లు సిఫార్సు చేసిందని చెప్పారు.

సిఫార్సు చేయబడిన గ్రాంట్‌ని 12 సమానమైన నెలవారీ వాయిదాలలో సిఫార్సు చేయబడిన 14 రాష్ట్రాలకు విడుదల చేయడం జరుగుతుందని, అందులో భాగంగా 2022-23లో ఇప్పటివరకు రాష్ట్రాలకు విడుదల చేసిన రెవెన్యూ డెఫిసిట్ గ్రాంట్ల మొత్తం రూ.14,366.84 కోట్లుకు చేరిందని చెప్పారు. ఈ 14 రాష్ట్రాల్లో ఆంధ్రప్రదేశ్, అస్సాం, హిమాచల్ ప్రదేశ్, కేరళ, మణిపూర్, మేఘాలయ, మిజోరాం, నాగాలాండ్, పంజాబ్, రాజస్థాన్, సిక్కిం, త్రిపుర, ఉత్తరాఖండ్ మరియు పశ్చిమ బెంగాల్ ఉన్నాయి.

రాష్ట్రాల వారీగా విడుదలైన పోస్ట్ డెవల్యూషన్ రెవెన్యూ డెఫిసిట్ గ్రాంట్ వివరాలు:

  1. ఆంధ్రప్రదేశ్‌ – రూ.879.08 కోట్లు
  2. అస్సాం – రూ.407.50 కోట్లు
  3. హిమాచల్‌ ప్రదేశ్‌ – రూ.781.42 కోట్లు
  4. కేరళ – రూ.1097.83 కోట్లు
  5. మణిపూర్‌ – రూ.192.50 కోట్లు
  6. మేఘాలయ – రూ.86.08 కోట్లు
  7. మిజోరాం – రూ.134.58 కోట్లు
  8. నాగాలాండ్‌ – రూ.377.50 కోట్లు
  9. పంజాబ్‌ – రూ.689.50 కోట్లు
  10. రాజస్థాన్ – రూ.405.17 కోట్లు
  11. సిక్కిం – రూ.36.67 కోట్లు
  12. పశ్చిమబెంగాల్ – రూ.1132.25 కోట్లు
  13. త్రిపుర – రూ.368.58 కోట్లు
  14. ఉత్తరాఖండ్ -‌ రూ.594.75 కోట్లు

 

మ్యాంగో న్యూస్ లింక్స్:

టెలీగ్రామ్ : https://t.me/mangonewsofficial

గూగుల్ ప్లే స్టోర్ : https://bit.ly/2R4cbgN

ఆపిల్/ఐఓఎస్ స్టోర్ : https://apple.co/2xEYFJ

 

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

twelve − three =