14 రాష్ట్రాలకు రూ.7,183.42 కోట్లు విడుదల చేసిన కేంద్ర ఆర్థిక శాఖ, ఏపీకి రూ.879.08 కోట్లు

Ministry of Finance Released Revenue Deficit Grant of Rs 7183.42 Cr to 14 States, Finance Ministry Released Revenue Deficit Grant of Rs 7183.42 Cr to 14 States, Union Finance Ministry Released Revenue Deficit Grant of Rs 7183.42 Cr to 14 States, Union Finance Ministry Released Revenue Deficit Grant to 14 States, Andhra Pradesh, Assam, Kerala, Punjab, Rajasthan, Uttarakhand, West Bengal, Centre releases revenue deficit grant to 14 states, revenue deficit grant, revenue deficit grant News, revenue deficit grant Latest News, revenue deficit grant Latest Updates, revenue deficit grant Live Updates, Mango News, Mango News Telugu,

కేంద్ర ఆర్థిక శాఖ సోమవారం నాడు దేశంలోని 14 రాష్ట్రాలకు రూ.7,183.42 కోట్లు విడుదల చేసింది. 15వ ఆర్థిక సంఘం సిఫార్సుల మేరకు పోస్ట్ డెవల్యూషన్ రెవెన్యూ డెఫిసిట్ గ్రాంట్ కింద ఈ ఆర్ధిక సంవత్సరంలో మూడో విడతగా 14 రాష్ట్రాలకు రూ.7,183.42 కోట్లు విడుదల చేసినట్టు కేంద్ర ఆర్థిక శాఖ తెలిపింది. 15వ ఆర్థిక సంఘం పీడీఆర్డీ గ్రాంట్ కింద 2022-23 ఆర్థిక సంవత్సరానికి గానూ 14 రాష్ట్రాలకు మొత్తం 86,201 కోట్లు సిఫార్సు చేసిందని చెప్పారు.

సిఫార్సు చేయబడిన గ్రాంట్‌ని 12 సమానమైన నెలవారీ వాయిదాలలో సిఫార్సు చేయబడిన 14 రాష్ట్రాలకు విడుదల చేయడం జరుగుతుందని, అందులో భాగంగా 2022-23లో ఇప్పటివరకు రాష్ట్రాలకు విడుదల చేసిన రెవెన్యూ డెఫిసిట్ గ్రాంట్ల మొత్తం రూ.21,550.25 కోట్లుకు చేరిందని చెప్పారు. ఈ 14 రాష్ట్రాల్లో ఆంధ్రప్రదేశ్, అస్సాం, హిమాచల్ ప్రదేశ్, కేరళ, మణిపూర్, మేఘాలయ, మిజోరాం, నాగాలాండ్, పంజాబ్, రాజస్థాన్, సిక్కిం, త్రిపుర, ఉత్తరాఖండ్ మరియు పశ్చిమ బెంగాల్ ఉన్నాయి.

రాష్ట్రాల వారీగా విడుదలైన మూడో విడత పోస్ట్ డెవల్యూషన్ రెవెన్యూ డెఫిసిట్ గ్రాంట్:

  1. ఆంధ్రప్రదేశ్‌ – రూ.879.08 కోట్లు
  2. అస్సాం – రూ.407.50 కోట్లు
  3. హిమాచల్‌ ప్రదేశ్‌ – రూ.781.42 కోట్లు
  4. కేరళ – రూ.1097.83 కోట్లు
  5. మణిపూర్‌ – రూ.192.50 కోట్లు
  6. మేఘాలయ – రూ.86.08 కోట్లు
  7. మిజోరాం – రూ.134.58 కోట్లు
  8. నాగాలాండ్‌ – రూ.377.50 కోట్లు
  9. పంజాబ్‌ – రూ.689.50 కోట్లు
  10. రాజస్థాన్ – రూ.405.17 కోట్లు
  11. సిక్కిం – రూ.36.67 కోట్లు
  12. పశ్చిమబెంగాల్ – రూ.1132.25 కోట్లు
  13. త్రిపుర – రూ.368.58 కోట్లు
  14. ఉత్తరాఖండ్ -‌ రూ.594.75 కోట్లు

మ్యాంగో న్యూస్ లింక్స్:

టెలీగ్రామ్ : https://t.me/mangonewsofficial

గూగుల్ ప్లే స్టోర్ : https://bit.ly/2R4cbgN

ఆపిల్/ఐఓఎస్ స్టోర్ : https://apple.co/2xEY

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

three × 2 =