ఊపందుకున్న ఆత్మకూరు ఉపఎన్నికకు ప్రచారం, వైఎస్సార్సీపీ ఇంచార్జిల నియామకం

Atmakur Bye-election YSRCP Appointed Election Incharge's Mandal wise, YSRCP Appointed Election Incharge's Mandal wise, YSRCP Party Appointed Election Incharge's Mandal wise, Election Incharge's Mandal wise, Mandal wise Election Incharge's, YSR Congress Party is doing everything possible to win the Atmakur Bye-election, Atmakur Assembly constituency, YSRCP, Election Incharge's, Atmakur By poll, Atmakur Bye-election News, Atmakur Bye-election Latest News, Atmakur Bye-election Latest Updates, Atmakur Bye-election Live Updates, Mango News, Mango News Telugu,

నెల్లూరు జిల్లాలోని ఆత్మకూరు అసెంబ్లీ నియోజకవర్గ ఉప ఎన్నికలో అధికార వైఎస్ఆర్ కాంగ్రెస్‌ పార్టీ (వైఎస్సార్సీపీ) అభ్యర్ధిగా మేకపాటి విక్రమ్‌ రెడ్డి నామినేషన్‌ దాఖలు చేసిన విషయం తెలిసిందే. ఆత్మకూరు ఉపఎన్నికకు జూన్ 23న పోలింగ్ జరగనుంది. ఈ నేపథ్యంలో విక్రమ్‌ రెడ్డి ఇప్పటికే ఎన్నికల ప్రచారం ప్రారంభించారు. ఈ ఉపఎన్నికలో భారీ విజయమే లక్ష్యంగా వైఎస్సార్సీపీ ప్రణాళిక రూపొందిస్తుంది. ఈ మేరకు ఆత్మకూరు ఉపఎన్నిక కోసం మండలాలవారీగా వైఎస్సార్సీపీ ఎన్నికల ఇంచార్జిలను నియమించింది. నియోజవర్గంలోని ప్రతి మండలానికి ఒక మంత్రితో పాటుగా, ఓ ఎమ్మెల్యేను కూడా ఇంచార్జిలుగా నియమించారు.

మరోవైపు ఈ ఉపఎన్నికకు మొత్తం 28 మంది అభ్యర్థులు నామినేషన్లు దాఖలు చేయగా, నేడు (జూన్ 7) నామినేషన్ల పరిశీలన జరగనుంది. ఇక జూన్ 9 నామినేషన్ల ఉపసంహరణకు ఆఖరుతేదీగా ప్రకటించగా, ఎంతమంది అభ్యర్థులు ఉండనున్నారో ఆరోజున తెలియనుంది. ఇక ఈ స్థానంలో బీజేపీ నుంచి గుండ్లపల్లి భరత్ కుమార్ యాదవ్ నామినేషన్ దాఖలు చేయగా, టీడీపీ పోటీ చేయకూడదని నిర్ణయించింది.

ఆత్మకూరు ఉపఎన్నికకు మండలాలవారీగా వైఎస్సార్సీపీ ఇంచార్జిలు వీరే:

  1. ఆత్మకూరు రూరల్‌: మంత్రి కారుమూరి నాగేశ్వరరావు, ఎమ్మెల్యే తోపుదుర్తి ప్రకాష్ రెడ్డి
  2. ఆత్మకూరు అర్బన్‌: మంత్రి అంజాద్‌ బాషా, ఎమ్మెల్యే గడికోట శ్రీకాంత్‌
  3. సంగం : మంత్రి నారాయణ స్వామి, ఎమ్మెల్యే ప్రసన్నకుమార్‌రెడ్డి
  4. ఎఎస్‌పేట: మంత్రి జోగి రమేష్‌, ఎమ్మెల్యే ద్వారకానాథ్‌రెడ్డి
  5. అనంతసాగరం: మంత్రి మేరుగ నాగార్జున, ఎమ్మెల్యే చెవిరెడ్డి భాస్కరరెడ్డి
  6. చేజర్ల: మంత్రి ఆర్కే రోజా, ఎమ్మెల్యే కొడాలి నాని
  7. మర్రిపాడు: మంత్రి వేణుగోపాలకృష్ణ, ఎమ్మెల్యే అనిల్‌ కుమార్‌ యాదవ్‌.

మ్యాంగో న్యూస్ లింక్స్:

టెలీగ్రామ్ : https://t.me/mangonewsofficial

గూగుల్ ప్లే స్టోర్ : https://bit.ly/2R4cbgN

ఆపిల్/ఐఓఎస్ స్టోర్ : https://apple.co/2xEY

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

four × one =