కంటైన్మెంట్ జోన్లలో మినహా ఈ నెల 8వ తేదీ నుంచి మతపరమైన ప్రదేశాలు/ప్రార్థనా స్థలాలు, హోటళ్లు, రెస్టారెంట్లు, షాపింగ్ మాల్స్ తెరిచేందుకు కేంద్రప్రభుత్వం అన్ని రాష్ట్రాలు/కేంద్రపాలిత ప్రాంతాలకు అనుమతి ఇచ్చిన సంగతి తెలిసిందే. ఈ నేపథ్యంలో అన్ని రకాల ప్రార్థనా స్థలాల్లో చేయాల్సిన ఏర్పాట్లు, ప్రజలు పాటించాల్సిన నిబంధలను కేంద్ర ఆరోగ్య, కుటుంబ సంక్షేమ మంత్రిత్వ శాఖ ప్రకటించింది.
ప్రార్థనా స్థలాల్లో పాటించాల్సిన నిబంధనలు:
- బహిరంగ ప్రదేశాల్లో వ్యక్తులు కనీసం 6 అడుగుల దూరం ఉండాలి.
- ఫేస్ కవర్లు/ మాస్కులు తప్పనిసరిగా వాడాలి.
- సబ్బుతో (కనీసం 40-60 సెకన్ల పాటు) తరచుగా చేతులు కడుక్కోవాలి. ఆల్కహాల్ ఆధారిత హ్యాండ్ శానిటైజర్లతో (కనీసం 20 సెకన్లు) చేతులు శుభ్రం చేసుకోవాలి.
- దగ్గుతున్నప్పుడు లేదా తుమ్ముతున్నప్పుడు కర్చీఫ్, టిస్యూ లేదా మోచేతిని అడ్డుపెట్టుకోవాలి.
- ఆరోగ్యాన్ని పర్యవేక్షించుకోవాలి, ఏదైనా అనారోగ్యానికి గురైతే వెంటనే జిల్లా హెల్ప్‌లైన్ ను సంప్రదించాలి.
- ఉమ్మివేయడం చేయకూడదు, పూర్తిగా నిషేధం.
- ఆరోగ్య సేతు యాప్ యొక్క డౌన్ లోడ్ చేసుకుని వివరాలు నమోదు చేయాలి.
అన్ని మతపరమైన ప్రదేశాలు వద్ద చేయాల్సిన ఏర్పాట్లు:
- ఎంట్రీ వద్ద తప్పనిసరి శానిటైజర్ డిస్పెన్సర్ మరియు థర్మల్ స్క్రీనింగ్ ఏర్పాటు చేయాలి.
- ప్రాంగణంలోకి కరోనా లక్షణాలు లేని వ్యక్తులను మాత్రమే అనుమతించాలి.
- ఫేస్ కవర్ / మాస్క్‌లు ఉపయోగిస్తేనే ప్రవేశానికి అనుమతించాలి.
- కరోనా నివారణ చర్యలపై పోస్టర్లు / స్టాండ్స్ ప్రదర్శించాలి. నివారణ చర్యలపై అవగాహన కల్పించడానికి ఆడియో మరియు వీడియో క్లిప్‌లు ప్రదర్శించాలి.
- షూస్ / పాదరక్షలు సొంత వాహనం లోపలే విడిచి రావాలి లేదా ప్రత్యేక స్టాండ్స్ ఏర్పాటు చేయాలి.
- పార్కింగ్ స్థలాలలో మరియు ప్రాంగణానికి వెలుపల భక్తుల రద్దీ ఎక్కువుగా ఉండకుండా చూడాలి, భౌతిక దూరం పాటించేలా ఏర్పాట్లు చేయాలి.
- ప్రాంగణం వెలుపల మరియు లోపల ఏదైనా షాపులు, స్టాల్స్, పుడ్ కోర్ట్స్ వద్ద భౌతిక దూరం పాటించేలా చూడాలి
- క్యూలైన్స్ లో తగినంత దూరంతో భౌతిక దూరం పాటించేలా మార్కులు గీయాలి.
- భక్తుల కోసం ప్రత్యేక ప్రవేశం మరి బయటకు వచ్చేందుకు వేర్వేరు మార్గాలు ఉండాలి.
- క్యూలో నిలబడినప్పుడు అన్ని సమయాల్లో కూడా కనీసం 6 అడుగుల భౌతిక దూరాన్ని పాటించాలి.
- లోనికి ప్రవేశించే ముందు సబ్బు మరియు నీటితో చేతులు మరియు కాళ్ళను కడుక్కోవాలి.
- ప్రాంగణంలో తగినంత భౌతిక దూరం ఉండే విధంగా సీటింగ్ ఏర్పాట్లు చేయాలి.
- ఎయిర్ కండిషనింగ్ / వెంటిలేషన్ కోసం సిపిడబ్ల్యుడి యొక్క మార్గదర్శకాలను అనుసరించాలి.
- విగ్రహాలు తాకడానికి అనుమతించకూడదు.
- గుంపులుగా, సమూహంగా ఏర్పడడం నిషేధం.
- ఒకరినొకరు పలకరించుకునే క్రమంలో షేక్ హాండ్స్ ఇవ్వడం మానుకోవాలి.
- ప్రార్థన మందిరాల్లో మాట్స్ వాడకుండా భక్తులు సొంతంగా తెచ్చుకోవాలి.
- ఆహారాన్ని తయారుచేసేటప్పుడు మరియు అన్నదానం, పలహారాల పంపిణీ చేసేటప్పుడు భౌతిక పాటించాలి.
- ప్రాంగణంలో పారిశుధ్యం, శుభ్రత చర్యలపై ప్రత్యేక దృష్టి సారించాలి. అన్ని ప్రదేశాలను తరచుగా రసాయన ద్రావణాలతో శుభ్రపరచడం చేయాలి.
- భక్తులు, సందర్శకులు వదిలిపెట్టిన పేస్ కవర్స్/మాస్కులు/ గ్లోవ్స్ ఎక్కడబడితే అక్కడ వేయకుండా నిర్దిష్టమైన ప్రదేశంలోనే వేసేలా చర్యలు తీసుకోవాలి.
మ్యాంగో న్యూస్ యాప్ లింక్స్:
గూగుల్ ప్లే స్టోర్ : https://bit.ly/2R4cbgN
ఆపిల్/ఐఓఎస్ స్టోర్ : https://apple.co/2xEYFJu