దేశవ్యాప్తంగా అన్ని కంటైన్మెంట్ జోన్లలో జూన్ 30 వరకు లాక్డౌన్ పొడిగిస్తూ ఇటీవలే కేంద్రప్రభుత్వం ప్రకటించిన సంగతి తెలిసిందే. అలాగే కంటైన్మెంట్ జోన్స్ కానీ ప్రాంతాల్లో ఇప్పటివరకు నిషేదించిన పలు కార్యకలాపాలను దశలవారీగా(ఫేజ్-1, ఫేజ్-2, ఫేజ్-3) తిరిగి ప్రారంభిస్తామని ప్రకటించారు. ఫేజ్-1 జూన్ 8 నుంచి మొదలవుతుందని తెలిపారు. ఈ నేపథ్యంలో కేంద్ర ప్రభుత్వం ప్రకటించిన లాక్డౌన్ నిబంధనలకు అనుగుణంగా తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం తాజాగా మార్గదర్శకాలు జారీ చేసింది. జూన్ 8 నుంచి ఇప్పటివరకు నిషేధించిన కొన్ని కార్యకలాపాలు రాష్ట్రంలో కూడా తిరిగి ప్రారంభం కానున్నాయి. అయితే కంటైన్మెంట్ జోన్లలో ఎలాంటి మినహాయింపు ఉండవని పేర్కొన్నారు.
జూన్ 8, 2020 నుంచి రాష్ట్రంలో ప్రారంభమయ్యే కార్యకలాపాలు:
- మతపరమైన ప్రదేశాలు / ప్రార్థనా స్థలాల్లో ప్రజలకు అనుమతి.
- హోటళ్ళు, రెస్టారెంట్లు మరియు ఇతర ఆతిథ్య సేవలకు అనుమతి.
- షాపింగ్ మాల్స్ (గేమింగ్ సెంటర్లు మరియు సినిమా హాల్స్ కు అనుమతి లేదు).
మ్యాంగో న్యూస్ యాప్ లింక్స్:
గూగుల్ ప్లే స్టోర్ : https://bit.ly/2R4cbgN
ఆపిల్/ఐఓఎస్ స్టోర్ : https://apple.co/2xEYFJu