ఆస్కార్ షార్ట్‌లిస్ట్ జాబితాలో స్థానం దక్కించుకున్న ‘ఆర్ఆర్ఆర్’ మరియు ‘ఛెల్లో షో’.. ఏ విభాగంలో అంటే?

Oscars 2023 Indian Movies RRR and Chhello Show Shortlisted Nominations To be Announced on Jan 24,RRR Oscar shortlist,Chello Show Oscar shortlist,Oscar shortlist list Movies,Mango News,Mango News Telugu,Jr Ntr,Akshay Kumar,Future Of Young India,Mega Power Star Ram Charan,Mega Power Star,S.S.Rajamouli,RRR,Rise Roar Revolt,Ram Charan Latest News and Updates,Ram Charan News and Live Updates,Ram Charan Latest Movie Updates,RRR Songs,RRR Video,Naatu Naatu Song Lyrics,Natu Natu Song,Rahul Sipligunj Naatu Naatu,RRR Natu Natu Song,RRR Natthu Nattu Song,RRR Natu Natu Song Singer Name,RRR Natu Natu Song Choreographer Name,RRR Natpu Natpu Video Song,RRR Natu Natu Video Song Download,RRR Natu Natu Song Dance Master,RRR Natu Natu Song Lyrics In Telugu,RRR Movie Natthu Nattu Song,RRR Songs Tamil Nattu Nattu

భారతీయ సినీ ప్రియులకు శుభవార్త. ప్రపంచ వ్యాప్తంగా ‘ఆస్కార్’ అవార్డులకు ఉన్న క్రేజ్ అంతా ఇంతా కాదు. జీవితంలో ఒక్కసారైనా ఆస్కార్ అవార్డు అందుకోవాలని ప్రతి నటుడు, నటి కోరుకుంటారంటే అతిశయోక్తి కాదు. అలాంటి ఆస్కార్ అవార్డు రేసులో మన భారతీయ సినిమాలు రెండు నిలిచాయి. ప్రముఖ దర్శకుడు ఎస్ఎస్ రాజమౌళి దర్శకత్వం వహించిన ఆర్ఆర్ఆర్ మరియు భారతదేశ అధికారిక ప్రవేశం అయిన గుజరాతీ-భాషా ‘ఛెల్లో షో'(ది లాస్ట్ షో)లు ఆస్కార్ షార్ట్‌లిస్ట్ జాబితాలో స్థానం దక్కించుకున్నాయి. 2023 అకాడమీ అవార్డుల కోసం వివిధ దశల్లో వడపోత కార్యక్రమం సాగుతుంది.

దీనిలో భాగంగా 10 విభాగాల్లో షార్ట్‌లిస్ట్ చేసిన ఎంట్రీల జాబితాను ఆస్కార్ అకాడమీ బుధవారం రాత్రి ప్రకటించింది. ఈ జాబితకోసం మొత్తం 15 సినిమాలు బరిలో నిలవగా.. వీటిలో ఆర్ఆర్ఆర్, ఛెల్లో షోలు చోటు సంపాదించాయి. ఆర్ఆర్ఆర్ లోని ‘నాటు నాటు’ పాట ‘ది బెస్ట్ ఒరిజినల్ సాంగ్’ కేటగిరీలో షార్ట్‌లిస్ట్ చేయబడగా.. ‘ఇంటర్నేషనల్ ఫీచర్ ఫిల్మ్’ విభాగంలో ఛెల్లో షో పోటీ పడుతోంది. ఇక వీటితో పాటు మరో రెండు భారతీయ షార్ట్ ఫిలిమ్స్.. ‘ఆల్ దట్ బ్రీత్స్’ మరియు ‘ది ఎలిఫెంట్ విస్పరర్స్’, ‘డాక్యుమెంటరీ ఫీచర్ ఫిల్మ్’ విభాగంలో చోటు దక్కించుకోవడం విశేషం. కాగా అకాడమీ అవార్డుల నామినేషన్లను జనవరి 24న ప్రకటించనున్నారు. ఈ షార్ట్ లిస్ట్ చేసిన 15 సినిమాల నుంచి ఐదు సినిమాల్ని ఆస్కార్‌కు నామినేట్ చేస్తారు. ఆ సినిమాలు మాత్ర‌మే 95వ అకాడమీ అవార్డులకు పోటీప‌డ‌తాయి.

మ్యాంగో న్యూస్ లింక్స్:

టెలీగ్రామ్ : https://t.me/mangonewsofficial

గూగుల్ ప్లే స్టోర్ : https://bit.ly/2R4cbgN

ఆపిల్/ఐఓఎస్ స్టోర్ : https://apple.co/2xEYFJ

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

twelve + four =