నేడు ఢిల్లీ రాంలీలా మైదాన్‌లో హీరో ప్రభాస్ చేతుల మీదుగా ‘రావణ దహనం’.. పాల్గొననున్న రాష్ట్రపతి ముర్ము, సీఎం కేజ్రీవాల్‌

Pan India Star Prabhas To Attend Dussehra Event Along with President Murmu and CM Kejriwal at Ramlila Maidan Delhi Today, Pan India Star Prabhas Attend Dussehra Event, President Murmu Dussehra Festival Celebrations , CM Kejriwal at Ramlila Maidan Dussehra Festival, Mango News, Mango News Telugu, President Murmu, CM Kejriwal, Rebel Star Prabhas, Prabhas Attended Ramlila Maidan, Prabhas Ravana Dahan At Ramlila Maidan, Ramlila Maidan, Dussehra Festival News And Live Updates, Adhipurush Teaser News And Updates

పాన్ ఇండియా స్టార్ ప్రభాస్‏కు అరుదైన గౌరవం దక్కనుంది. ప్రతి సంవత్సరం దసరా పండగా సందర్భంగా ఢిల్లీలోని రాంలీలా మైదానంలో అత్యంత ప్రతిష్టాత్మకంగా ‘రావణ దహనం’ కార్యక్రమం నిర్వహించడం తెలిసిందే. ఈ నేపథ్యంలో ఈ ఏడాది ఈ కార్యక్రమంలో పాల్గొనాల్సిందిగా ప్రభాస్‏కు ఆహ్వానం అందింది. ఈ క్రమంలో ఇప్పటికే రాంలీలా మైదానంలో ఘనంగా ఏర్పాట్లు చేశారు. ప్రభాస్‏తో పాటు రాష్ట్రపతి ద్రౌపది ముర్ము మరియు ఢిల్లీ ముఖ్యమంత్రి అరవింద్ కేజ్రీవాల్ కూడా ఈ వేడుకలకు హాజరు కానున్నారు. కాగా ఇంతకుముందు ఈ వేడుకలకు బాలీవుడ్ నటులు అక్షయ్ కుమార్, అజయ్ దేవగన్ మరియు జాన్ అబ్రహం తదితరులు పాల్గొన్నారు. ఇక ఈ సంవత్సరం ‘రావణ దహనం’ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా రాంలీలా మైదాన్‌ కమిటీ ప్రభాస్‌ను ఎంపిక చేసింది. ప్రభాస్ చేతుల మీదుగా ఏడాది ‘రావణ దహనం’ కార్యక్రమం జరుపనున్నట్లు కమిటీ ప్రకటించింది. ఇక రామాయణ ఇతిహసం ఆధారంగా డైరెక్టర్ ఓంరౌత్ తెరకెక్కించిన ఆదిపురుష్ చిత్రంలో ప్రభాస్ రాముడిగా నటిస్తున్న సంగతి తెలిసిందే.

మ్యాంగో న్యూస్ లింక్స్:

టెలీగ్రామ్ : https://t.me/mangonewsofficial

గూగుల్ ప్లే స్టోర్ : https://bit.ly/2R4cbgN

ఆపిల్/ఐఓఎస్ స్టోర్ : https://apple.co/2xEY

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

fifteen − 4 =