అమెరికాలో ఉచితంగా కరోనా వ్యాక్సిన్ పంపిణీ, 24 గంటల్లోనే మొదటి వ్యాక్సిన్: డోనాల్డ్ ట్రంప్

Pfizer Covid-19 Vaccine Is Free For All Americans, Will Be Administered In Less Than 24 Hours -Trump,Pfizer Covid-19 Vaccine Is Free,Pfizer Coronavirus Vaccine Is Free For All Americans,Donald Trump,Trump,Trump Latest News,Trump Says Pfizer Vaccine Will Be Free For All Americans,Trump On Pfizer Covid-19 Vaccine,FDA Clears Pfizer Vaccine,Pfizer,COVID-19,COVID-19 vaccine,Coronavirus vaccine,Pfizer COVID-19 vaccine,Mango News,Mango News Telugu,FDA Approves Pfizer Covid-19 Vaccine,US,US FDA,US FDA Approves Pfizer Coronavirus Vaccine,US Allows Emergency COVID-19 Vaccine,Coronavirus News Updates,Covid-19 Vaccine Latest News,Covid-19 Vaccine Latest Updates,COVID

అమెరికా బయోటెక్ దిగ్గజ కంపెనీ ఫైజర్, జర్మన్ కి చెందిన బయోఎన్‌టెక్‌ సంస్థతో కలిసి అభివృద్ధి చేసిన కరోనా వ్యాక్సిన్ కు అమెరికా ఎఫ్‌డీఏ ఆమోదం తెలపడంతో ప్రజలకు కరోనా వ్యాక్సిన్ పంపిణీ చేసేందుకు అమెరికా ప్రభుత్వం ఏర్పాట్లు చేస్తుంది. ఈ నేపథ్యంలో అమెరికా ప్రజలందరికి ఫైజర్‌ వ్యాక్సిన్‌ను ఉచితంగా అందిస్తామని అధ్యక్షుడు డొనాల్డ్‌ ట్రంప్‌ ప్రకటించారు. ఈ మేరకు ఆయన ఒక వీడియో విడుదల చేశారు. 9 నెలల్లోనే సమర్ధవంతమైన వ్యాక్సిన్ రూపొందించడం పట్ల సైంటిస్టులకు, వైద్యులకు ట్రంప్ అభినందనలు తెలియజేశారు. ఈ వ్యాక్సిన్ లక్షల మంది ప్రాణాలను కాపాడుతుందని, కరోనా మహమ్మారి అంతానికి పనిచేస్తుందని అన్నారు.

24 గంటల్లోనే మొదటి వ్యాక్సిన్:

ఫెడ్ఎక్స్‌, యూపీఎస్‌ లతో భాగస్వామ్యం ద్వారా ఇప్పటికే దేశంలోని ప్రతి రాష్ట్రానికి వ్యాక్సిన్ రవాణాను ప్రారంభించామని‌ ట్రంప్ అన్నారు. 24 గంటలలోపు లోనే మొదటి వ్యాక్సిన్ ప్రజలకు ఇవ్వబడుతుందని చెప్పారు. వ్యాక్సిన్ ఎక్కడికి పంపించాలి, ఎవరికి మొదటి డోసు ఇవ్వాలనే విషయాన్ని ఆయా రాష్ట్రాల గవర్నర్లు నిర్ణయిస్తారని అన్నారు. సీనియర్ సిటిజన్స్, హెల్త్ కేర్ వర్కర్స్ కు మొదటగా వ్యాక్సిన్ అందించాలని భావిస్తున్నామన్నారు. ప్రపంచంలోనే మొట్టమొదటగా సురక్షితమైన, సమర్ధవంతమైన కరోనా వ్యాక్సిన్ ను అమెరికా అందుబాటులోకి తెచ్చిందని డోనాల్డ్ ట్రంప్ వెల్లడించారు.

మ్యాంగో న్యూస్ లింక్స్:

టెలీగ్రామ్ : https://t.me/mangonewsofficial

గూగుల్ ప్లే స్టోర్ : https://bit.ly/2R4cbgN

ఆపిల్/ఐఓఎస్ స్టోర్ : https://apple.co/2xEYFJ

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

8 + sixteen =