సిరివెన్నెల సీతారామశాస్త్రి మరణం పట్ల పీఎం మోదీ, సీఎం కేసీఆర్, సీఎం వైఎస్ జగన్ సంతాపం

CM Jagan, CM KCR, Legendary lyricist Sirivennnela Sitaramasastry passes away, Lyricist Sirivennela Seetaramasastry passes away, Mango News, Noted Tollywood Lyricist Sirivennela Seetharama Sastry Passed Away, PM Modi, PM Modi CM KCR CM Jagan Mourned the Death of Noted Lyricist Sirivennala Seetharama Sastry, Popular Telugu lyricist Sirivennela, Seetharama Sastry, Seetharama Sastry passes away, Sirivennela Seetharama Sastry, Sirivennela Seetharama Sastry passes away, Telugu lyricist Sirivennela Seetharama Sastry, Tollywood Lyricist Sirivennela

ప్రముఖ సినీ గేయ రచయిత సిరివెన్నెల సీతారామశాస్త్రి మరణం పట్ల ప్రధాని నరేంద్ర మోదీ, తెలంగాణ ముఖ్యమంత్రి కె.చంద్రశేఖర్ రావు, ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి వైఎస్‌ జగన్‌ మోహన్‌ రెడ్డి సంతాపం వ్యక్తం చేశారు.

“అత్యంత ప్రతిభావంతులైన సిరివెన్నెల సీతారామశాస్త్రి గారి మరణం నన్నెంతగానో బాధించింది. ఆయన రచనలలో కవిత్వ పటిమ, బహుముఖ ప్రజ్ఞ గోచరిస్తుంది. తెలుగు భాషా ప్రాచుర్యానికి ఎంతగానో కృషి చేసారు. ఆయన కుటుంబసభ్యులకు ,స్నేహితులకు సంతాపాన్ని తెలియజేస్తున్నాను.ఓం శాంతి” అని ప్రధాని మోదీ అన్నారు.

ప్రముఖ తెలుగు సినీగేయ రచయిత, పద్మశ్రీ శ్రీ చేంబోలు (సిరివెన్నెల) సీతారామశాస్త్రి మరణం పట్ల సీఎం కె.చంద్రశేఖర్ రావు సంతాపం వ్యక్తం చేశారు. ఎటువంటి సంగీత ప్రక్రియలతోనైనా పెనవేసుకుపోయే అద్భుత సాహిత్యాన్ని సృష్టించిన సిరివెన్నెల, పండిత పామరుల హృదయాలను గెలిచారని సీఎం తెలిపారు. సినిమా పేరునే తన ఇంటి పేరుగా మార్చుకున్న ఆయన సాహిత్య ప్రస్థానం, సామాజిక, సాంప్రదాయ అంశాలను స్పృశిస్తూ మూడున్నర దశాబ్దాల పాటు సాగిందని అన్నారు. ఆయన మరణం, తెలుగు చలనచిత్ర రంగానికి, సంగీత సాహిత్య అభిమానులకు తీరని లోటన్నారు. వారి కుటుంబ సభ్యులకు సీఎం కేసీఆర్ తన ప్రగాఢ సానుభూతిని తెలిపారు.

“తెలుగు సినీ గేయ ప్రపంచంలో విలువల శిఖరం సిరివెన్నెల. అక్షరాలతో ఆయన చేసిన భావ విన్యాసాలు తెలుగువారి చరిత్రలో ఎప్పటికీ చిరంజీవులు. ఆయన హఠాన్మరణం మొత్తంగా తెలుగువారికి తీరనిలోటు” అని ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి వైఎస్‌ జగన్‌ మోహన్‌ రెడ్డి అన్నారు. సిరివెన్నెల సీతారామశాస్త్రి ఆత్మకు శాంతి కలగాలని కోరుకుంటూ, ఆయన కుటుంబ సభ్యులకు తన ప్రగాఢ సానుభూతిని తెలియజేస్తున్నానని సీఎం వైఎస్ జగన్ అన్నారు.

మ్యాంగో న్యూస్ లింక్స్:

టెలీగ్రామ్ : https://t.me/mangonewsofficial

గూగుల్ ప్లే స్టోర్ : https://bit.ly/2R4cbgN

ఆపిల్/ఐఓఎస్ స్టోర్ : https://apple.co/2xEYFJ

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

fifteen − 10 =