జగనన్న విద్యాదీవెన కింద 11.03 లక్షల విద్యార్థుల తల్లుల ఖాతాల్లో రూ.686 కోట్లు జమ : సీఎం జగన్

AP CM YS Jagan Mohan Reddy, AP CM YS Jagan Mohan Reddy Releases Third Tranche Of Jagananna Vidya Deevana Scheme, Chief Minister of Andhra Pradesh, Funds for Jagananna Vidya Deevena Scheme Third Phase, Jagananna Vidya Deevana, Jagananna Vidya Deevana Scheme, Jagananna Vidya Deevena Scheme Third Phase, Mango News, Third Tranche Of Jagananna Vidya Deevana Scheme, Vidya Deevana Scheme, ys jagan mohan reddy, YS Jagan Mohan Reddy Releases Third Tranche Of Jagananna Vidya Deevana Scheme

ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి వైఎస్‌ జగన్‌ మోహన్ ‌రెడ్డి మంగళవారం నాడు ఈ ఏడాది ‘జగనన్న విద్యాదీవెన’ పథకం మూడో విడత కింద రూ.686 కోట్ల నిధులు విడుదల చేశారు. ఫీజు రీయింబర్స్‌మెంట్ కింద రాష్ట్రవ్యాప్తంగా మొత్తం 11.03 లక్షల మంది విద్యార్థుల తల్లుల ఖాతాల్లో రూ.686 కోట్లను తాడేపల్లిలోని సీఎం క్యాంపు కార్యాలయం నుంచి సీఎం వైఎస్ జగన్ జమ చేశారు. జగన్న విద్యా దీవెన పథకం ద్వారా ఐటీఐ, పాలిటెక్నిక్‌, డిగ్రీ, ఇంజనీరింగ్, మెడిసిన్‌ తదితర కోర్సులు చదివే పేద విద్యార్థులు కాలేజీలకు చెల్లించాల్సిన పూర్తి ఫీజుల మొత్తాన్ని ప్రతి మూడు నెలలకొకసారి అనగా మొత్తం నాలుగు విడతల్లో విద్యార్థుల తల్లుల ఖాతాల్లో ప్రభుత్వం జమ చేస్తుంది. మొదటి విడత చెల్లింపుల కింద ఏప్రిల్ లో రూ.671.45 కోట్లు అందించగా, రెండో విడతగా జూలైలో రూ.693.81 కోట్లు చెల్లింపులును జమ చేశారు. ఇక నేడు మూడో విడతగా రూ.686 కోట్లు చెల్లించగా, నాలుగో విడత చెల్లింపులు వచ్చే ఫిబ్రవరిలో జరగనున్నాయి.

ఈ సందర్భంగా సీఎం వైఎస్ జగన్ ట్వీట్ చేస్తూ “మన లక్ష్యం 100% అక్షరాస్యత మాత్రమే కాదు, 100% పిల్లల్ని గ్రాడ్యుయేట్లుగా నిలబెట్టడం కూడా. దేవుడి దయతో మరో మంచి కార్యక్రమానికి శ్రీకారం చుట్టాం. 11.03 లక్షల మంది విద్యార్థులకు లబ్ది కలిగేలా ఈ ఏడాది 3వ త్రైమాసికానికి సంబంధించిన ఫీజు రీయింబర్స్‌మెంట్ రూ.686 కోట్లు విడుదల చేశాం. పెద్ద చదువులు చదవడానికి, పెద్ద స్థాయికి ఎదగడానికి ఎవరికీ పేదరికం అడ్డుకాకూడదు. అరకొరగా కాకుండా అర్హులైన ప్రతి పేద విద్యార్థికీ మంచి చేస్తూ పూర్తి ఫీజు రీయింబర్స్‌మెంట్ అమలు చేస్తున్నాం. కుటుంబంలో ఎంతమంది పిల్లలు ఉన్నా వారందరికీ పూర్తి ఫీజు రీయింబర్స్‌మెంట్ వర్తింపజేస్తున్నాం” అని పేర్కొన్నారు.

మ్యాంగో న్యూస్ లింక్స్:

టెలీగ్రామ్ : https://t.me/mangonewsofficial

గూగుల్ ప్లే స్టోర్ : https://bit.ly/2R4cbgN

ఆపిల్/ఐఓఎస్ స్టోర్ : https://apple.co/2xEYFJ

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

eleven − three =