జ‌పాన్ ప్ర‌ధాని ఫుమియో కిషిడాతో ప్రధాని మోదీ ద్వైపాక్షిక స‌మావేశం

PM Modi held Bilateral Meeting with Japan PM Fumio Kishida at Tokyo, Bilateral Meeting with Japan PM Fumio Kishida at Tokyo, Japan PM Fumio Kishida, Bilateral Meeting, Japanese counterpart Fumio Kishida, Japanese PM Fumio Kishida, PM Modi Japan Visit, PM Modi Japan Tour, PM Modi to attend Shinzo Abe's funeral in Tokyo, PM Narendra Modi, Shinzo Abe's funeral, Quad Leaders' Summit, bilateral meeting between PM Modi and PM Kishida, PM Modi, PM Modi Japan Tour News, PM Modi Japan Tour Latest News And Updates, PM Modi Japan Tour Live Updates, Mango News, Mango News Telugu

ప్రధాని నరేంద్ర మోదీ మంగళవారం జపాన్ దేశంలో పర్యటిస్తున్నారు. ఈ పర్యటనలో భాగంగా జ‌పాన్ ప్ర‌ధానమంత్రి ఫుమియో కిషిడాతో ప్రధాని మోదీ ద్వైపాక్షిక స‌మావేశం నిర్వ‌హించారు. ఈ సందర్భంగా ముందుగా మాజీ ప్రధాని షింజో అబే మృతికి ప్రధాని మోదీ తన ప్రగాఢ సంతాపాన్ని తెలియజేశారు. భారతదేశం-జపాన్ భాగస్వామ్యాన్ని బలోపేతం చేయడం మరియు ఫ్రీ, ఓపెన్ మరియు సమ్మిళితంతో కూడిన ఇండో-పసిఫిక్ ప్రాంతం యొక్క విజన్ ను సంభావితం చేయడంలో దివంగత జపాన్ ప్రధాని అబే అందించిన సేవలను ప్రధాని మోదీ గుర్తు చేశారు.

ఇక ఇరువురు నేతలు ద్వైపాక్షిక సంబంధాలను మరింతగా బలోపేతం చేయడంపై ప్రొడక్టీవ్ అభిప్రాయాలను మార్పిడి చేసుకున్నారని, అలాగే వారు అనేక ప్రాంతీయ మరియు ప్రపంచ సమస్యలపై కూడా చర్చించారని ప్రధానిమంత్రి కార్యాలయం వెల్లడించింది. భారత్-జపాన్ ప్రత్యేక వ్యూహాత్మక, ప్రపంచ భాగస్వామ్యాన్ని మరింత బలోపేతం చేయడానికి మరియు ప్రాంతీయ, వివిధ అంతర్జాతీయ గ్రూప్స్, సంస్థలలో కలిసి పని చేయడంలో ఇరువురూ నాయకులు తమ నిబద్ధతను పునరుద్ధరించారని తెలిపారు. మరోవైపు జపాన్ మాజీ ప్రధాని షింజో అబేకు జపాన్ ప్రభుత్వం మంగళవారం ఉదయం ప్ర‌భుత్వ లాంఛ‌నాల‌తో తుది వీడ్కోలు కార్యక్రమం నిర్వహించింది. టోక్యోలోని నిప్పాన్ బుడోకాన్ హాల్‌లో జరిగిన షింజో అబే అధికారిక వీడ్కోలు కార్యక్రమానికి ప్రధాని మోదీ హాజరయి, షింజో అబేకు నివాళులర్పించారు.

మ్యాంగో న్యూస్ లింక్స్:

టెలీగ్రామ్ : https://t.me/mangonewsofficial

గూగుల్ ప్లే స్టోర్ : https://bit.ly/2R4cbgN

ఆపిల్/ఐఓఎస్ స్టోర్ : https://apple.co/2xEY

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here