ట్యాంక్ బండ్ వద్ద జలదృశ్యంలో కొండా లక్ష్మణ్ బాపూజీ విగ్రహాన్ని ఆవిష్కరించిన మంత్రి కేటీఆర్

Minister KTR Unveiled the Statue of Konda Laxman Bapuji at Tank Bund Today, Statue of Konda Laxman Bapuji at Tank Bund, Minister KTR Unveiled the Statue of Konda Laxman Bapuj, Statue of Konda Laxman Bapuji, Tank Bund, Telangana Minister KTR, Konda Laxman Bapuji, Konda Laxman Bapuji Tribute, Indian freedom fighter Konda Laxman Bapuji, Konda Laxman Bapuji Statue News, Konda Laxman Bapuji Statue Latest News And Updates, Konda Laxman Bapuji Statue Live Updates, Mango News, Mango News Telugu

కొండా లక్ష్మణ్ బాపూజీ జయంతిని తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం అధికారికంగా నిర్వహిస్తున్న విషయం తెలిసిందే. ఈ నేపథ్యంలో కొండా లక్ష్మణ్ బాపూజీ జయంతి వేడుకలు (సెప్టెంబర్ 27) తెలంగాణ వ్యాప్తంగా ఘనంగా జరుగుతున్నాయి. అందులో భాగంగా మంగళవారం ఉదయం తెలంగాణ రాష్ట్ర ఐటీ, పరిశ్రమలు, మున్సిపల్ శాఖ మంత్రి కేటీఆర్ హైదరాబాద్ నగరంలోని ట్యాంక్ బండ్ వద్ద జలదృశ్యంలో కొండా లక్ష్మణ్ బాపూజీ విగ్రహాన్ని ఆవిష్కరించారు. ఈ కార్యక్రమంలో రాష్ట్ర మంత్రులు తలసాని శ్రీనివాస్ యాదవ్, ఎర్రబెల్లి దయాకర్ రావు, గంగుల కమలాకర్, రాష్ట్ర ప్రణాళిక సంఘం ఉపాధ్యక్షుడు వినోద్ కుమార్, ఎమ్మెల్యేలు దానం నాగేందర్, ముఠా గోపాల్, ఎమ్మెల్సీ ఎల్ .రమణ, బాపూజీ కుటుంబ సభ్యులు పాల్గొన్నారు

అనంతరం మంత్రి కేటీఆర్ ట్వీట్ చేస్తూ కొండా లక్ష్మణ్ బాపూజీ విగ్రహాన్ని ఆవిష్కరించి తెలంగాణ ఆత్మగౌరవ పతాకాన్ని సమున్నతంగా ఎగురవేశామని అన్నారు. “ఏ జలదృశ్యంలో అయితే ఉద్యమనాయకుడు కేసీఆర్ నాయకత్వంలో టీఆర్ఎస్ ఉద్భవించిందో, ఏ జలదృశ్యం అయితే అవమానకరంగా అప్పటి ప్రభుత్వం కూల్చివేసిందో, ఈరోజు అక్కడే కొండా లక్ష్మణ్ బాపూజీ విగ్రహాన్ని ఘనంగా ఆవిష్కరించుకున్నాం. తెలంగాణ ఆత్మగౌరవ పతాకాన్ని సమున్నతంగా ఎగురవేశాం” అని మంత్రి కేటీఆర్ పేర్కొన్నారు.

మ్యాంగో న్యూస్ లింక్స్:

టెలీగ్రామ్ : https://t.me/mangonewsofficial

గూగుల్ ప్లే స్టోర్ : https://bit.ly/2R4cbgN

ఆపిల్/ఐఓఎస్ స్టోర్ : https://apple.co/2xEY

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here