సోషల్ మీడియా డీపీలను త్రివర్ణ పతాకానికి మార్చుకోవాలని దేశ పౌరులను కోరిన ప్రధాని మోదీ

PM Modi Urges Citizens to Change their Social Media DP to Tricolour, Modi Urges Citizens to Change their Social Media DP to Tricolour, Citizens to Change their Social Media DP to Tricolour, Social Media DP to Tricolour, PM Modi changes his social media profile picture to Indian flag, Prime Minister Narendra Modi put tiranga as the display picture of his social media accounts, PM Narendra Modi put tiranga as the display picture of his social media accounts and urged people to do the same, Narendra Modi put tiranga as the display picture of his social media accounts and urged people to do the same, tiranga as the display picture of his social media accounts, Citizens to Change their social media accounts DP to Tricolour, Har Ghar Tiranga, Har Ghar Tiranga News, Har Ghar Tiranga Latest News, Har Ghar Tiranga Latest Updates, Har Ghar Tiranga Live Updates, PM Narendra Modi, Narendra Modi, Prime Minister Narendra Modi, Prime Minister Of India, Narendra Modi Prime Minister Of India, Prime Minister Of India Narendra Modi, Mango News, Mango News Telugu,

భారత స్వాతంత్య్ర 75వ సంవత్సరాన్ని పురస్కరించుకుని దేశంలో ‘ఆజాదీ కా అమృత్ మహోత్సవ్‌’ ను జరుపుకుంటున్న తరుణంలో హర్ ఘర్ తిరంగా సెలెబ్రేట్ చేసుకోవడానికి దేశ పౌరులందరూ తమ సోషల్ మీడియా డీపీ (డిస్ప్లే పిక్చర్)లను త్రివర్ణ పతాకానికి మార్చాలని ప్రధాన మంత్రి నరేంద్ర మోదీ కోరారు. ఈ మేరకు ప్రధాని మోదీ ట్వీట్ చేశారు.

“ఆగస్ట్ 2, ఈరోజు ప్రత్యేకమైనది. మనం ఆజాదీ కా అమృత్ మహోత్సవ్‌ను జరుపుకుంటున్న తరుణంలో, మన దేశం మన త్రివర్ణ పతాకాన్ని సెలెబ్రేట్ చేసుకునే సమిష్టి ఉద్యమం అయిన హర్‌ ఘర్‌ తిరంగా కోసం సిద్ధంగా ఉంది. నేను నా సోషల్ మీడియా పేజీలలో డీపీని మార్చాను మరియు మీ అందరినీ అలాగే చేయమని కోరుతున్నాను” అని ప్రధాని మోదీ పేర్కొన్నారు. ఆగస్టు 2 నుంచి 15వ తేదీ వరకు ప్రతి ఒక్కరూ సోషల్ మీడియా డీపీల్లో త్రివర్ణ పతాకాన్ని ఉంచాలని ఇటీవలే ప్రధాని మోదీ సూచించారు

హర్ ఘర్ తిరంగా ప్రచారంలో భాగంగా ప్రధాని నరేంద్ర మోదీ, కేంద్ర హోం మంత్రి అమిత్ షా సహా పలువురు కేంద్రమంత్రులు, ప్రముఖులు ఆగస్టు 2 ఉదయం తమ సోషల్ మీడియా హ్యాండిల్స్ ప్రొఫైల్ చిత్రాన్ని మార్చి, త్రివర్ణ పతాకాన్ని ఉంచారు. ఆజాదీ కా అమృత్ మహోత్సవ్‌ ను జరుపుకుంటున్న తరుణంలో హర్ ఘర్ తిరంగ ఉద్యమాన్ని బలోపేతం చేసే దిశగా ఆగస్టు 13 మరియు 15 మధ్య ఇళ్లలో త్రివర్ణ పతాకాన్ని ఎగురవేయాలని లేదా ప్రదర్శించాలని దేశ ప్రజలకు ప్రధాని మోదీ పిలుపునిచ్చిన విషయం తెలిసిందే.

మరోవైపు జాతీయ జెండా రూపకర్త పింగళి వెంకయ్య జయంతి సందర్భంగా ప్రధాని మోదీ ఆయనకు నివాళులర్పించారు. “పింగళి వెంకయ్య గారి జయంతి సందర్భంగా ఆయనకు నివాళులర్పిస్తున్నాను. మనం ఎంతో గర్వించదగ్గ త్రివర్ణ పతాకాన్ని మనకు అందించడానికి ఆయన చేసిన కృషికి మన జాతి ఆయనకు ఎప్పటికీ రుణపడి ఉంటుంది. త్రివర్ణ పతాకం నుండి బలాన్ని, స్ఫూర్తిని పొందుతూ మనం దేశ ప్రగతికి కృషి చేద్దాం” అని ప్రధాని మోదీ అన్నారు

మ్యాంగో న్యూస్ లింక్స్:

టెలీగ్రామ్ : https://t.me/mangonewsofficial

గూగుల్ ప్లే స్టోర్ : https://bit.ly/2R4cbgN

ఆపిల్/ఐఓఎస్ స్టోర్ : https://apple.co/2xEY

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here