తెలంగాణ: ఆర్మూరు టీఆర్‌ఎస్‌ ఎమ్మెల్యే జీవన్ రెడ్డి హత్యకు కుట్ర.. నిందితుడి అరెస్ట్

Telangana Suspected Person Detained by Police For Conspiracy To Armoor TRS MLA Jeevan Reddy, Police arrested a man who was roaming suspiciously at Armoor MLA Jeevan Reddy's residence, Suspected Person Detained by Police For Conspiracy To Armoor TRS MLA Jeevan Reddy, Conspiracy To Armoor TRS MLA Jeevan Reddy, Armoor TRS MLA Jeevan Reddy, TRS MLA Jeevan Reddy, Attempt to murder On Armoor TRS MLA Jeevan Reddy, Attempt to murder On TRS MLA, Armoor TRS MLA Jeevan Reddy News, Armoor TRS MLA Jeevan Reddy Latest News, Armoor TRS MLA Jeevan Reddy Latest Updates, Armoor TRS MLA Jeevan Reddy Live Updates, Mango News, Mango News Telugu,

తెలంగాణలో అధికార టీఆర్ఎస్ ఎమ్మెల్యే హత్యకు కుట్ర జరిగింది. ఈ మేరకు నిజామాబాద్‌ జిల్లా ఆర్మూర్‌ టీఆర్‌ఎస్‌ ఎమ్మెల్యే జీవన్‌ రెడ్డిపై హత్యాయత్నానికి ప్రయత్నించిన వ్యక్తిని మంగళవారం హైదరాబాద్ పోలీసులు అరెస్ట్ చేశారు. బంజారాహిల్స్‌ రోడ్‌ నంబర్‌ 12లోని వేమూరీ ఎన్ క్లేవ్‌లో ఎమ్మెల్యే జీవన్‌ రెడ్డి నివాసం దగ్గర ఈ ఘటన చోటుచేసుకుంది. ఎమ్మెల్యే ఇంటి పరిసరాల్లో అనుమానాస్పదంగా తిరుగుతున్న వ్యక్తిని భద్రతా సిబ్బంది గమనించి పోలీసులకు సమాచారం ఇచ్చారు. దీంతో వెంటనే అక్కడకు చేరుకున్న పోలీసులు అతడిని అదుపులోకి తీసుకున్నారు.

విచారణలో అతడిని నిందితుడు నిజామాబాద్ జిల్లా ఆర్మూరు నియోజకవర్గానికి చెందిన మక్లూర్‌ మండలం కిల్లెడ గ్రామ సర్పంచ్‌ భర్త ప్రసాద్‌ గౌడ్‌గా వ్యక్తిగా గుర్తించారు. కాగా గతంలో తన భార్య లావణ్యను సర్పంచ్‌ పదవి నుంచి సస్పెండ్‌ సస్పెండ్‌ అయిన విషయంలో ఎమ్మెల్యే జీవన్‌రెడ్డిపై కూడా పగ పెంచుకున్న ఆయన జీవన్ రెడ్డిని హత్య చేసేందుకు ఇంటి చుట్టూ తిరుగుతున్నట్లు నిర్ధారణకు వచ్చారు. కాగా అతడి వద్ద నుంచి రెండు పిస్టల్స్‌, కత్తిని పోలీసులు స్వాధీనం చేసుకున్నారు. అయితే నగరంలో పటిష్ట భద్రత మధ్య ఉండే ఎమ్మెల్యే పైనే వ్యక్తి హత్యాయత్నానికి ప్రయత్నించడం కొంత కలకలం సృష్టించింది. ఇక అదుపులోకి తీసుకున్న అతడిని పోలీసులు విచారణ జరుపుతున్నారు.

మ్యాంగో న్యూస్ లింక్స్:

టెలీగ్రామ్ : https://t.me/mangonewsofficial

గూగుల్ ప్లే స్టోర్ : https://bit.ly/2R4cbgN

ఆపిల్/ఐఓఎస్ స్టోర్ : https://apple.co/2xEY

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

five × 5 =