అరుదైన రికార్డు సొంతం చేసుకున్న ప్రధాని నరేంద్ర మోదీ

national news, PM Modi, PM Modi longest serving indian non congress prime minister, pm narendra modi, PM Narendra Modi Becomes Longest Serving Non-Congress Prime Minister, prime minister modi, Prime Minister Narendra Modi, Prime Minister Of India

ప్రధాని నరేంద్ర మోదీ మరో అరుదైన రికార్డును సొంతం చేసుకున్నారు. ఆగస్టు 13, గురువారం నాటికీ దేశంలో ఎక్కువ కాలం పదవిలో ఉన్న నాలుగో ప్రధాన మంత్రిగా మోదీ నిలిచారు. అలాగే ఎక్కువ కాలం పదవిలో ఉన్న కాంగ్రెసేతర ప్రధానిగా కూడా మోదీ గుర్తింపు పొందారు. ఇప్పటివరకు కాంగ్రెస్ పార్టీ ప్రధానుల తర్వాత, ఎక్కువ రోజులు ప్రధానిగా బాధ్యతలు నిర్వహించిన మాజీ ప్రధాని, దివంగత అటల్ బిహారీ వాజ్‌పేయి 2,268 రోజులు రికార్డును ప్రధాని మోదీ తాజాగా అధిగమించారు. మే 26, 2014న మొదటిసారిగా, మే 30, 2019న రెండోసారిగా ప్రధాని మోదీ పదవీ బాధ్యతలు చేపట్టారు.

దేశంలో ఎక్కువ కాలం ప్రధానిగా బాధ్యతలు చేపట్టిన నేతలు:

  • జవహర్‌ లాల్‌ నెహ్రూ (6,130 రోజులు లేదా దాదాపు 17 ఏళ్లు)
  • ఇందిరా గాంధీ (5,829 రోజులు లేదా దాదాపు 16 ఏళ్లు)
  • మన్మోహన్‌ సింగ్ (3,656 రోజులు లేదా 10 ఏళ్లు)
  • నరేంద్ర మోదీ ( ఇప్పటికి 2,269 రోజులు)

మ్యాంగో న్యూస్ యాప్ లింక్స్:

గూగుల్ ప్లే స్టోర్ : https://bit.ly/2R4cbgN

ఆపిల్/ఐఓఎస్ స్టోర్ : https://apple.co/2xEYFJu

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

15 + 12 =