11 మంది పిల్లలకు ప్రధానమంత్రి జాతీయ బాల పురస్కార్-2023 లను ప్రధానం చేసిన రాష్ట్రపతి ద్రౌపది ముర్ము

President Droupadi Murmu Conferred the Pradhan Mantri Rashtriya Bal Puraskar 2023 on 11 Children,Pradhan Mantri Rashtriya Bal Puraskar,Bal Shakti Puraskar List,Pm Rashtriya Bal Puraskar,Pradhan Mantri Rashtriya Bal Puraskar,Mango News,Mango News Telugu,Pradhan Mantri Rashtriya Bal Puraskar 2022,Pradhan Mantri Rashtriya Bal Puraskar 2022 Winners List,Pradhan Mantri Rashtriya Bal Puraskar 2023,Pradhan Mantri Rashtriya Bal Puraskar 2023 Winners List,Rashtriya Bal Puraskar 2019,Rashtriya Bal Puraskar 2021,Rashtriya Bal Puraskar 2022,Rashtriya Bal Puraskar 2022 List,Rashtriya Bal Puraskar 2022 Winners,Rashtriya Bal Puraskar 2023,Rashtriya Bal Puraskar Eligibility

ఢిల్లీలోని విజ్ఞాన్ భవన్ లో జనవరి 23, సోమవారం జరిగిన అవార్డు ప్రదానోత్సవం కార్యక్రమంలో భారత రాష్ట్రపతి ద్రౌపది ముర్ము 11 మంది పిల్లలకు ప్రధానమంత్రి జాతీయ బాల పురస్కార్-2023 లను ప్రదానం చేశారు. ఆర్ట్ అండ్ కల్చర్, శౌర్యం, ఇన్నోవేషన్, స్కాలస్టిక్, సోషల్ సర్వీస్ మరియు స్పోర్ట్స్ అనే ఆరు విభాగాల్లో అత్యుత్తమ ప్రతిభ కనబరిచినందుకు 5-18 సంవత్సరాల వయస్సు గల పిల్లలకు ప్రతి ఏడాది ప్రధానమంత్రి జాతీయ బాల పురస్కార్ లను అందజేస్తున్నారు. ఈ ఏడాది ఆర్ట్ అండ్ కల్చర్, శౌర్యం, ఇన్నోవేషన్, సోషల్ సర్వీస్ మరియు స్పోర్ట్స్ విభాగాల్లో 11 మంది పిల్లలకు ఈ అవార్డులు అందజేశారు. ఈ అవార్డు పొందిన ప్రతి ఒక్కరికి ఒక పతకంతో పాటుగా రూ.1 లక్ష నగదు బహుమతి మరియు సర్టిఫికేట్ ఇవ్వబడుతుంది.

ఈ సందర్భంగా రాష్ట్రపతి ద్రౌపది ముర్ము మాట్లాడుతూ, చిన్నారులు మన దేశానికి అమూల్యమైన ఆస్తులని అన్నారు. వారి భవిష్యత్తును నిర్మించడానికి చేసే ప్రతి ప్రయత్నం మన సమాజం మరియు దేశం యొక్క భవిష్యత్తును రూపొందిస్తుందన్నారు. వారి సురక్షితమైన మరియు సంతోషకరమైన బాల్యం మరియు ఉజ్వల భవిష్యత్తు కోసం మనం ప్రతి ప్రయత్నం చేయాలని, పిల్లలకు అవార్డులు ఇవ్వడం ద్వారా, మనం దేశ నిర్మాణంలో వారి సహకారాన్ని ప్రోత్సహిస్తున్నామని మరియు గౌరవిస్తున్నామని పేర్కొన్నారు. అవార్డు గ్రహీతల్లో కొందరు ఇంత చిన్న వయసులో ఇంతటి అచంచలమైన ధైర్యాన్ని, పరాక్రమాన్ని ప్రదర్శించారని, వారి గురించి తెలుసుకుని ఆశ్చర్యపోవడమే కాకుండా పొంగిపోయానని రాష్ట్రపతి అన్నారు. వారు సాధించిన ఘనత దేశంలోని మిగతా పిల్లలు మరియు యువత అందరికీ స్ఫూర్తిదాయకమన్నారు. పిల్లలకు ఎక్కడ అవకాశాలు వచ్చినా దేశ ప్రయోజనాల గురించి ఆలోచించాలని, దేశం కోసం పని చేయాలని రాష్ట్రపతి ద్రౌపది ముర్ము సూచించారు.

ప్రధానమంత్రి జాతీయ బాల పురస్కార్-2023 పొందినవారు వీరే:

 1. ఆదిత్య సురేష్ – ఆర్ట్ అండ్ కల్చర్ – కేరళ
 2. ఎం.గౌరవి రెడ్డి – ఆర్ట్ అండ్ కల్చర్ – తెలంగాణ
 3. సంభాబ్ మిశ్రా – ఆర్ట్ అండ్ కల్చర్ – ఒడిశా
 4. శ్రేయా భట్టాచార్జీ – ఆర్ట్ అండ్ కల్చర్ – అస్సాం
 5. రోహన్ రామచంద్ర బహిర్ – శౌర్యం/బ్రేవరీ – మహారాష్ట్ర
 6. ఆదిత్య ప్రతాప్ సింగ్ చౌహాన్ – ఇన్నోవేషన్ – ఛత్తీస్‌గఢ్
 7. రిషి శివ్ పర్సన్న – ఇన్నోవేషన్ – కర్ణాటక
 8. అనౌష్క జాలీ – సోషల్ సర్వీస్ – ఢిల్లీ
 9. శౌర్యజిత్ రంజిత్‌కుమార్ ఖైరే – స్పోర్ట్స్ – గుజరాత్
 10. కోలగట్ల అలన మీనాక్షి – స్పోర్ట్స్ – ఆంధ్రప్రదేశ్
 11. హనాయ నిసార్ – స్పోర్ట్స్ – జమ్మూ అండ్ కాశ్మీర్.

మ్యాంగో న్యూస్ లింక్స్:

టెలీగ్రామ్ : https://t.me/mangonewsofficial

గూగుల్ ప్లే స్టోర్ : https://bit.ly/2R4cbgN

ఆపిల్/ఐఓఎస్ స్టోర్ : https://apple.co/2xE

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here