ఏపీ ఈఏపీసెట్ సహా పలు ఇతర ప్రవేశ పరీక్షల షెడ్యూల్స్ విడుదల.. ఏఏ తేదీల్లో అంటే?

Andhra Pradesh EAPCET ICET ECET and Other Common Entrance Tests Dates Finalized,APEAPCET 2023 Exam Schedule Releases, Exams To Begin From May 15,APEAPCET 2023 Exam Schedule,Mango News,Mango News Telugu,Eapcet Sche Aptonline In,Ap Eamcet,Apeapcet Results,Ap Eamcet 2021,Ap Eamcet Counselling,Ap Eamcet Results 2022,Ap Eamcet Results 2021,Ap Eamcet Counselling Dates 2021,Ap Eamcet 2021 Application Form,Apeapcet.Nic.In 2021,Ap Eamcet 2021 Exam Date,Andhra Pradesh EAPCET, ICET, ECET,Other Common Entrance Tests Dates Finalized

ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ఇంజినీరింగ్, అగ్రికల్చర్ మరియు ఫార్మసీ వంటి కోర్సుల్లో ప్రవేశాలకు సంబంధించి నిర్వహించనున్న ‘ఆంధ్రప్రదేశ్ ఇంజినీరింగ్, అగ్రికల్చర్, ఫార్మసీ కామన్ ఎంట్రన్స్ టెస్ట్ (ఏపీ ఈఏపీసెట్) ప్రవేశ పరీక్షల షెడ్యూల్ విడుదల అయింది. దీనిప్రకారం.. ఈఏపీసెట్ ఎంపీసీ విభాగం పరీక్షలు మే 15 నుంచి 22 వరకు జరగనుండగా.. బైపీసీ విభాగం ప్రవేశ పరీక్షలు మే 23, 24, 25 తేదీల్లో జరుగనున్నాయి. ఈ మేరకు ఏపీ ఉన్నత విద్యామండలి షెడ్యూల్ విడుదల చేసింది. అలాగే దీనితో పాటుగా రాష్ట్రంలోని పలు ఇతర ప్రవేశ పరీక్షల షెడ్యూల్స్ కూడా విడుదల అయ్యాయి. ఈసెట్, పీజీ ఈసెట్, ఐసెట్, లాసెట్, ఎడ్‌సెట్, పీజీ సెట్, ఆర్‌సెట్ వంటి ప్రవేశ పరీక్షల షెడ్యూల్స్ గతంలో కంటే ముందుగా నిర్వహించి ప్రవేశాలు పూర్తిచేయడానికి షెడ్యూల్ విడుదల చేసింది. కరోనా కారణంగా గత్ రెండు, మూడు సంవత్సరాలు సరిగా సాగకపోవడం, ఆలస్యమవడం వంటివి దృష్టిలో ఉంచుకుని ఈసారి జూన్ నాటికి అన్ని ప్రవేశ పరీక్షల ప్రక్రియను పూర్తి చేసి జులై నాటికి తరగతులు ప్రారంభమయ్యేలా ఉన్నత విద్యామండలి తాజా నిర్ణయం తీసుకుంది.

వివిధ సెట్ల ప్రవేశ పరీక్షలు ఏఏ తేదీల్లో జరుగుతాయంటే?

  • ఈసెట్ (ఇంజినీరింగ్ సెకండ్ ఇయర్) : మే 5
  • ఈఏపీసెట్ (ఎంపీసీ విభాగం) : మే 15 – మే 22
  • ఈఏపీసెట్ (బైపీసీ విభాగం) : మే 23 – మే 25
  • లాసెట్ (బీఎల్, ఎంఎల్) : మే 20
  • ఎడ్‌సెట్ (బీఈడీ) : మే 20
  • ఐసెట్ (ఎంబీఏ, ఎంసీఏ) : మే 25 – మే 26
  • పీజీ ఈసెట్ (ఎంటెక్, ఎంఫార్మసీ) : మే 28 – మే 30
  • పీజీ సెట్ (అన్ని వర్సిటీలలో పీజీ) : జూన్ 6 – జూన్ 10
  • ఆర్‌సెట్ (పీహెచ్‌డీ) : జూన్ 12 – జూన్ 14

మ్యాంగో న్యూస్ లింక్స్:

టెలీగ్రామ్ : https://t.me/mangonewsofficial

గూగుల్ ప్లే స్టోర్ : https://bit.ly/2R4cbgN

ఆపిల్/ఐఓఎస్ స్టోర్ : https://apple.co/2xE

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here