తెలంగాణ ప్రజలకు రాష్ట్ర ఆవిర్భావ దినోత్సవ శుభాకాంక్షలు తెలిపిన పలువురు ప్రముఖులు

President Ramnath Kovind PM Modi Greets People of Telangana on State Formation Day, PM Modi Greets People of Telangana on State Formation Day, President Ramnath Kovind Greets People of Telangana on State Formation Day, Telangana State Formation Day, Telangana State, President Ramnath Kovind PM Modi Wishes People of Telangana on State Formation Day, PM Modi Wishes People of Telangana on State Formation Day, President Ramnath Kovind Wishes People of Telangana on State Formation Day, President Ramnath Kovind, President Of India Ramnath Kovind, PM Narendra Modi, Narendra Modi, Prime Minister Narendra Modi, Prime Minister Of India, Narendra Modi Prime Minister Of India, Prime Minister Of India Narendra Modi, Telangana Formation Day News, Telangana Formation Day Latest News, Telangana Formation Day Latest Updates, Telangana Formation Day Live Updates, Mango News, Mango News Telugu,

తెలంగాణ రాష్ట్ర ఆవిర్భావ దినోత్సవం సందర్భంగా రాష్ట్రపతి రామ్ నాథ్ కోవింద్, ప్రధానమంత్రి నరేంద్ర మోదీ, రాష్ట్ర గవర్నర్ తమిళిసై సౌందరరాజన్, కేంద్ర హోమ్ శాఖ మంత్రి అమిత్ షా, కాంగ్రెస్ పార్టీ అగ్రనేత రాహుల్ గాంధీ, పలువురు కేంద్రమంత్రులు, నాయకులు తెలంగాణ ప్రజలకు శుభాకాంక్షలు తెలిపారు.

తెలంగాణ ప్రజలకు రాష్ట్ర అవతరణ దినోత్సవ శుభాకాంక్షలు. సుసంపన్నమైన సంస్కృతి మరియు వారసత్వంతో ఆశీర్వదించబడిన తెలంగాణ అభివృద్ధి సూచికలలో ప్రశంసనీయమైన పురోగతిని సాధించింది మరియు పరిశ్రమలకు కేంద్రంగా ఆవిర్భవించింది. తెలంగాణ నిరంతరం అభివృద్ధి చెందాలని మరియు ప్రజల ఆకాంక్షలను నెరవేర్చాలని కోరుకుంటున్నాను – రాష్ట్రపతి రామ్ నాథ్ కోవింద్

రాష్ట్ర ఆవిర్భావ దినోత్సవ సందర్భంగా, నా తెలంగాణ సోదర, సోదరీ మణులకు శుభాకాంక్షలు. కష్టపడి పని చేయడంలో, దేశాభివృద్ధికి పాటుపడడంలో పేరు పొందినవారు తెలంగాణ రాష్ట్ర ప్రజలు. ప్రపంచ ప్రఖ్యాతి పొందినది తెలంగాణ రాష్ట్ర సంస్కృతి. తెలంగాణ ప్రజల శ్రేయస్సుకై నేను ప్రార్ధిస్తున్నాను – ప్రధాని నరేంద్ర మోదీ

ప్రపంచవ్యాప్తంగా ఉన్న తెలంగాణ ప్రజలందరికీ తెలంగాణ రాష్ట్ర ఆవిర్భావ దినోత్సవ శుభాకాంక్షలు మరియు ఈ లక్ష్యం కోసం తమ జీవితాలను త్యాగం చేసిన వారికి నివాళులు – గవర్నర్ తమిళిసై సౌందరరాజన్

దేశ ప్రగతి కోసం కట్టుబడిన యువత కృషితో తెలంగాణ రాష్ట్రం ఆవిర్భవించింది. తెలంగాణ ప్రజల శ్రేయస్సును కాంక్షిస్తూ రాష్ట్రం అభివృద్ధి దిశగా పయనించాలని కోరుతూ, తెలంగాణ ప్రజలకు రాష్ట్ర అవతరణ దినోత్సవ శుభాకాంక్షలు – కేంద్రమంత్రి అమిత్ షా

తమ పోరాట స్ఫూర్తితో యావత్ దేశానికి స్ఫూర్తిదాయకమైన నా తెలంగాణ సోదరసొదరీమణులందరికీ రాష్ట్ర ఆవిర్భావ దినోత్సవ శుభాకాంక్షలు. ఈ చారిత్రాత్మక రోజున అమరవీరుల, వారి కుటుంబసభ్యుల త్యాగాలను స్మరించుకుందాం – కాంగ్రెస్ అగ్రనేత రాహుల్ గాంధీ

రాష్ట్ర ఆవిర్భావ దినోత్సవం సందర్భంగా తెలంగాణలోని నా సోదరులు, సోదరీమణులకు హృదయపూర్వక శుభాకాంక్షలు తెలియజేస్తున్నాను. అపారమైన సంభావ్యతతో ఆశీర్వదించబడిన, మనం ఎల్లప్పుడూ వికాస్ మరియుసమృద్ధితో ముందుకు సాగుదాం. రాబోయే సంవత్సరాల్లో తెలంగాణ ప్రగతి మరియు శ్రేయస్సు కోసం నేను ప్రార్థిస్తున్నాను – కేంద్రమంత్రి కిషన్ రెడ్డి

మ్యాంగో న్యూస్ లింక్స్:

టెలీగ్రామ్ : https://t.me/mangonewsofficial

గూగుల్ ప్లే స్టోర్ : https://bit.ly/2R4cbgN

ఆపిల్/ఐఓఎస్ స్టోర్ : https://apple.co/2xEYF

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

thirteen − 5 =