ఐసీసీ ప్లేయర్ ఆఫ్ ది మంత్ అవార్డు రేసులో‌ అశ్విన్, ‌జో రూట్‌, కైల్‌ మేయర్స్‌

ICC Awards, ICC Cricket, ICC Men’s Player of the Month 2021, ICC Men’s Player of the Month for January 2021, ICC Player of the Month Award, ICC Player of the Month nominated members, ICC Player of the Month nominations, ICC Player of the Month nominations for February, ICC Player of the Month nominations for February announced, ICC Player of the Month nominations news, Joe Root, Kyle Mayers Nominated for ICC Player of the Month Award, Mango News, Ravichandran Ashwin

అంతర్జాతీయ క్రికెట్ అన్ని రకాల ఫార్మాట్లలో ఉత్తమ ప్రదర్శనలకు సంబంధించి అంతర్జాతీయ క్రికెట్ కౌన్సిల్ (ఐసీసీ) ఇటీవలే “ప్లేయర్ ఆఫ్ ది మంత్” అవార్డు ప్రవేశపెట్టిన సంగతి తెలిసిందే. మెన్ మరియు ఉమెన్ క్రికెటర్ల విభాగంలో ఈ అవార్డును అందజేస్తున్నారు. అందులో భాగంగా ఫిబ్రవరి నెలకు గానూ ఐసీసీ ప్లేయర్‌ ఆఫ్‌ ది మంత్‌ అవార్డుకు ముగ్గురు క్రికెటర్లను ఐసీసీ నామినేట్‌ చేసింది. ఈ ముగ్గురిలో భారత్ బౌలింగ్ ఆల్ రౌండర్ రవిచంద్రన్ అశ్విన్ చోటు దక్కించుకున్నాడు. ఇంగ్లాండ్ తో స్వదేశంలో జరుగుతున్న టెస్టు సిరీస్ లో 24 వికెట్లు తీసి, బ్యాటింగ్ లో కూడా ఓ సెంచరీతో అశ్విన్ అత్యుత్తమ ప్రతిభ కనబరిచిన సంగతి తెలిసిందే.

అలాగే నామినేట్ అయిన వారిలో ఇంగ్లాండ్‌ కెప్టెన్‌ జో రూట్‌, విండీస్‌ ఆటగాడు కైల్‌ మేయర్స్‌ ఉన్నారు. జో రూట్ భారత్​ తో జరిగిన తొలి టెస్టులో డబుల్ సెంచరీ (218) సాధించాడు, మరియు మూడో టెస్టులో 5 వికెట్లు పడగొట్టాడు. ఇక వెస్టిండీస్ ఆటగాడు కైల్‌ మేయర్స్‌ బంగ్లాదేశ్‌తో జరిగిన టెస్టు సిరీస్‌లో డబుల్‌ సెంచరీ (210*‌) చేశాడు. కైల్‌ మేయర్స్ కు అది తొలిటెస్టు మ్యాచ్ కావడం విశేషం.

మరోవైపు మహిళా క్రికెటర్లకు సంబంధించి టామీ బ్యూమాంట్ (ఇంగ్లాండ్), నాట్ సైవర్ (ఇంగ్లాండ్), బ్రూక్‌ హిల్లాడే (న్యూజిలాండ్‌) ఐసీసీ ప్లేయర్‌ ఆఫ్‌ ది మంత్ అవార్డుకు నామినేట్‌ అయ్యారు. ఇక 2021 జనవరి నెల నుంచి ఈ అవార్డుల ప్రకటన మొదలుకాగా, టీమిండియా ఆటగాడు రిషబ్ పంత్ ప్రారంభ ఐసీసీ మెన్స్ ప్లేయర్ ఆఫ్ ది మంత్ అవార్డును గెలుచుకున్నాడు. అలాగే ప్రారంభ ఐసీసీ ఉమెన్స్ ప్లేయర్ ఆఫ్ ది మంత్ అవార్డును సౌత్ ఆఫ్రికా క్రికెట్ క్రీడాకారిణి షాబ్నిమ్ ఇస్మాయిల్ గెలుచుకున్నారు.

మ్యాంగో న్యూస్ లింక్స్:

టెలీగ్రామ్ : https://t.me/mangonewsofficial

గూగుల్ ప్లే స్టోర్ : https://bit.ly/2R4cbgN

ఆపిల్/ఐఓఎస్ స్టోర్ : https://apple.co/2xEYFJ

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

five × 2 =