వారెన్‌ బఫెట్‌ను దాటేసిన రిలయన్స్‌ ఇండస్ట్రీస్‌ అధినేత ముకేశ్‌ అంబానీ

Coronavirus, Coronavirus Breaking News, Coronavirus Latest News, COVID-19, telangana, Telangana Corona Updates, Telangana Coronavirus, Telangana Coronavirus Cases, Telangana Coronavirus Deaths, Telangana Coronavirus New Cases, Telangana Coronavirus News, Telangana New Positive Cases, Total COVID 19 Cases

రిలయన్స్‌ ఇండస్ట్రీస్‌ అధినేత ముకేశ్‌ అంబానీ ఇటీవలే ప్రపంచంలోని టాప్‌-10 ధనవంతుల జాబితాలోకి చేరిన సంగతి తెలిసిందే. తాజాగా ఆయన మరో ఘనత సాధించారు. బ్లూమ్‌బర్గ్‌ బిలినియర్స్ ఇండెక్స్ ప్రకారం ప్రముఖ బిజినెస్ టైకూన్ వారెన్ బఫెట్‌ను దాటేసి ప్రపంచ ధనవంతుల జాబితాలో ఎనిమిదో స్థానానికి చేరుకున్నారు. రిలయన్స్‌ ఇండస్ట్రీస్‌ లిమిటెడ్‌ మార్కెట్ విలువ 68.3 బిలియన్‌ డాలర్లకు చేరుకుంది. దీంతో 67.9 బిలియన్ డాలర్లుగా ఉన్న బఫెట్ సంస్థను దాటేయడంతో జాబితాలో అంబానీ ఆయనకంటే ముందు స్థానానికి చేరుకున్నారు. బఫెట్‌ ప్రస్తుతం తొమ్మిదో స్థానంలో కొనసాగుతున్నారు. ఆసియా దేశాల నుంచి ప్రపంచ కుబేరుల టాప్‌-10 జాబితాలో ముఖేశ్‌ అంబానీ ఒక్కరే చోటు దక్కించుకున్నారు.

మ్యాంగో న్యూస్ యాప్ లింక్స్:

గూగుల్ ప్లే స్టోర్ : https://bit.ly/2R4cbgN

ఆపిల్/ఐఓఎస్ స్టోర్ : https://apple.co/2xEYFJu

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

eight + 5 =