‌ప్లేస్టోర్‌ నుంచి 11 యాప్‌ల తొలగించిన గూగుల్‌

Google, Google bans apps, Google blocks these 11 smartphone apps, Google latest updates, Google Play Store removes 11 apps, Google Removes 11 Apps, Google Removes 11 Apps From Play Store, Google removes 11 Joker malware-laced apps, Joker malware

టెక్ దిగ్గజం గూగుల్‌ సంస్థ తన ప్లేస్టోర్‌ నుంచి 11 యాప్‌ లను తొలగించింది. ఈ యాప్స్ చట్టబద్ధమైనవి అయినప్పటికీ మాల్‌వేర్‌ లను డౌన్‌లోడ్ చేయడం ద్వారా పలు రకాల ఫైల్‌లను వినియోగదారుల మొబైల్స్ లోకి చొప్పించే సామర్థ్యాన్ని కలిగి ఉన్నాయని చెప్పారు. భద్రతా తనిఖీల్లో భాగంగా చెక్‌ పాయింట్ రీసెర్చర్స్ ఈ యాప్‌లన్నింటిలో జోకర్ డ్రాపర్ మరియు ప్రీమియం డయలర్ స్పైవేర్ అనే వైరస్‌ను గుర్తించినట్టు తెలుస్తుంది. దీంతో గూగుల్ ఈ యాప్ లను ప్లే స్టోర్ నుండి తొలగించింది. అయితే ముందుగా ఇన్‌స్టాల్ చేసుకున్న వినియోగదారులు వీటిని స్వతహాగా డిలీట్ చేసుకోవాల్సి ఉంటుంది.

గూగుల్‌ ప్లేస్టోర్‌ నుంచి తొలగించిన 11 యాప్‌ల జాబితా:

  • com.imagecompress.android
  • com.LPlocker.lockapps
  • com.contact.withme.texts
  • com.peason.lovinglovemessage
  • com.hmvoice.friendsms
  • com.training.memorygame
  • com.relax.relaxation.androidsms
  • com.cheery.message.sendsms
  • com.file.recovefiles
  • com.remindme.alram

 

మ్యాంగో న్యూస్ యాప్ లింక్స్:

గూగుల్ ప్లే స్టోర్ : https://bit.ly/2R4cbgN

ఆపిల్/ఐఓఎస్ స్టోర్ : https://apple.co/2xEYFJu

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

10 + 9 =